Mohammad Azharuddin Condemned The Apex Council Action Against Him :
తనపై వస్తున్న ఆరోపణలు నిరాధారమని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్.సి.ఏ.) అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ స్పష్టం చేశారు. తనపై చర్యలు తీసుకునే అధికారం అపెక్స్ కౌన్సిల్ కు లేదన్నారు. అపెక్స్ కౌన్సిల్ లో తాను కొనసాగుతానని, అధ్యక్షుడిగా తన అనుమతి లేకుడా ఏమీ చేయలేరని వ్యాఖానించారు. హెచ్.సి.ఏ. జనరల్ బాడీ తనను అధ్యక్షుడిగా ఎన్నుకుందని గుర్తు చేశారు.
25 ఏళ్ళుగా హెచ్.సి.ఏ.లో బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని, అజార్ ఆరోపించారు. సభ్యులపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని, వీటిపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అతి త్వరలో జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించి ప్రస్తుత కమిటీని రద్దు చేస్తానని ప్రకటించారు. అసోషియేషన్ కు ఎన్నికలు జరిగితే పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు.
కాగా, అజర్ ఆరోపణలను అపెక్స్ కౌన్సిల్ ఖండించింది. లోదా సిఫార్సుల మేరకే అజార్ కు నోటీసులు జారీ చేశామని, ఈ రోజు నుంచి అయన అధ్యక్షుడు కాదని స్పష్టం చేసింది. అజార్ తో పాటు ఐదుగురు సభ్యులకు షోకాజ నోటీసులు ఇచ్చామని వెల్లడించింది. ఈ విషయంలో బిసిసిఐ జోక్యం చేసుకునే అవకాశం లేదని, ఆయనకు ఏవైనా అభ్యంతరాలుంటే కోర్టుకు వెళ్ళవచ్చని సూచించింది.
ఇటీవల జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అజార్ కు షోకాజ్ నోటీసు జారీ చేయాలని నిర్ణయించారు. మొన్న 15వ తేదీన అజారుద్దీన్ కు నోటీసు ఇచ్చారు, హెచ్ సి ఏ అధ్యక్షుడిగా తొలగిస్తున్నామని, మీపై వచ్చిన ఆరోపణలకు వారం రోజుల్లోగా తగిన వివరణ ఇవ్వకపోతే తగిన చర్య తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు. విచారణ పూర్తయ్యే వరకూ అధ్యక్ష పదవితో పాటు సభ్యత్వం కూడా కోల్పోతారని వెల్లడించింది కౌన్సిల్. దీనిపై అజారుద్దీన్ మండిపడుతున్నారు.
Must Read : టెస్ట్ క్రికెట్ నిరంతరం వర్ధిల్లాలి: ఛటేశ్వర్ పుజారా