2022 Thomas & Uber Cup: థామస్ కప్ లో ఇండియా చరిత్ర సృష్టించింది. 43 ఏళ్ళ తరువాత సెమీస్ లో అడుగుపెట్టింది. హోరాహోరీగా జరిగిన నేటి క్వార్టర్ ఫైనల్స్ లో ఐదుసార్లు విజేత మలేషియాను 3-2 తేడాతో ఓడించింది. రేపు జరిగే సెమీఫైనల్స్ మ్యాచ్ లో డెన్మార్క్ తో ఇండియా జట్టు తలపడనుంది.
బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బ్యాంకాక్ లో జరుగుతోన్న టోటల్ ఇంజనీర్స్ థామస్ అండ్ ఊబెర్ కప్ ఫైనల్స్ 2022 టోర్నీలో ఇండియా పురుషుల జట్టు సెమీస్ లో ప్రవేశించగా…. మహిళల జట్లు క్వార్టర్ లో థాయ్ లాండ్ చేతిలో ఓటమి పాలైంది.
థామస్ కప్ : ఇండియా- మలేషియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో
తొలి మ్యాచ్ లో (సింగిల్స్) లక్ష్య సేన్ పై లీ జి జియా 23-21; 21-9తో విజయం సాధించాడు
రెండో మ్యాచ్ లో (డబుల్స్) సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి జోడీ 21-19; 21-15తో గో ఫై- ఇజ్జుద్దిన్ ద్వయంపై గెలుపొందారు.
మూడో మ్యాచ్ లో (సింగిల్స్) కిడాంబి శ్రీకాంత్ 21-11;21-17తో జే యాంగ్ పై గెలుపొంది స్కోరు 2-1 ఆధిక్యానికి తీసుకెళ్ళాడు
నాలుగో మ్యాచ్ లో (డబుల్స్) కృష్ణ ప్రసాద్- విష్ణు వర్ధన్ గౌడ్ జోడీపై 21-19; 21-17 తేడాతో ఆరోన్ చియా-తియో ఏ ఈ జోడీ గెలుపొంది స్కోరు 2-2తో సమం చేశారు.
నిర్ణాయక ఐదో మ్యాచ్ లో హెచ్ ఎస్ ప్రన్నోయ్ 21-13; 21-8 తేడాతో లియాంగ్ జూన్ హావో ను ఓడించి జట్టు సెమీస్ లో అడుగుపెట్టడంలో కీలక పాత్ర పోషించాడు.
ఉబెర్ కప్ (మహిళలు) లో ఇండియా క్వార్టర్స్ లోనే వెనుదిరిగింది. నేడు జరిగిన మ్యాచ్ లో తాయ్ లాండ్ చేతిలో 3-0తో భారత మహిళల జట్టు ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.
సింగిల్స్ విభాగంలో
- పివి సింధు 21-18; 17-21; 12-21 తేడాతో ఇంటానన్ చేతిలో…..
- ఆకర్షి కాశ్యప్ 16-21; 11-21 తో చోచువాంగ్ చేతిల్లో
డబుల్స్ విభాగంలో
- శ్రుతి మిశ్రా- సిమ్రాన్ సింఘి జోడీ 16-21;13-21 తేడాతో జోంగ్ కోల్ఫాన్-ప్రజోంగ్ జాయ్ జోడీ చేతిలో ఓటమి పాలయ్యారు.
మూడు వరుస మ్యాచ్ లు ఓటమి పాలుకావడంతో మిగిలిన రెండు మ్యాచ్ లు ఆడకుండానే థాయ్ లాండ్ సెమీస్ కు చేరింది.
Also Read : క్వార్టర్స్ లో మలేషియా, థాయ్ లాండ్ జట్లతో ఇండియా పోరు