Sunday, September 29, 2024
Homeసినిమాబాల‌య్య కోసం స్టైల్ మారుస్తున్న అనిల్ రావిపూడి.

బాల‌య్య కోసం స్టైల్ మారుస్తున్న అనిల్ రావిపూడి.

New Style: నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ‌.. మ‌లినేని గోపీచంద్ తో ఓ భారీ యాక్ష‌న్ మూవీ చేస్తున్నారు. ఇందులో బాల‌య్య స‌ర‌స‌న అందాల తార శృతిహాస‌న్ న‌టిస్తోంది. ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. బాల‌య్య పుట్టిన‌రోజైన జూన్ 10న ఈ సినిమా టీజ‌ర్ అండ్ టైటిల్ రిలీజ్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. అయితే.. ఈ సినిమా త‌ర్వాత బాల‌య్య‌.. స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడితో సినిమా చేయ‌నున్నారు.

గ‌త కొన్ని రోజులుగా ఈ భారీ చిత్రం గురించి వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. అయితే.. జులై నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నున్న‌ట్టు తెలిసింది. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే.. ఇప్ప‌టి వ‌ర‌కు అనిల్ రావిపూడి సినిమా అంటే.. కామెడీ అనేది కామ‌న్. అది ఏ హీరో సినిమా అయినా కామెడీని మిస్ చేయ‌కుండా సినిమా తీశాడు. దీంతో ఆయన కామెడీ సినిమాలే తీయ‌గ‌ల‌డు.. యాక్ష‌న్ సినిమాలు తీయ‌లేడు అనే టాక్ ఉంది.

అయితే… బాల‌య్యతో చేసే సినిమా విష‌యంలో త‌న స్టైల్ మార్చాల‌నుకుంటున్నాడ‌ట అనిల్ రావిపూడి. త‌న‌పై ఉన్న ముద్ర‌ను చెరిపేసేలా బాల‌య్య‌తో యాక్ష‌న్ మూవీ ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. కామెడీ ఉన్న‌ప్ప‌టికీ… యాక్ష‌నే ప్ర‌ధానంగా క‌థ ఉంటుంద‌ని.. ఈ సినిమాలో బాల‌య్య‌ను స‌రికొత్త‌గా చూపిస్తాన‌ని చెబుతున్నారు.  దీంతో ఈ సినిమా పై మ‌రెంత ఆస‌క్తి ఏర్ప‌డింది.

Also Read : రెండో హ్యాట్రిక్ కు రెడీ అవుతోన్న బాలయ్య-బోయపాటి

RELATED ARTICLES

Most Popular

న్యూస్