తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) 20వ వార్షికోత్సవం సందర్భంగా రేపు మంగళవారం (ఏప్రిల్ 27న) రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిపై గులాబీ జెండా ఎగురవేద్దామని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు ఇచ్చారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు, కార్యకర్తలు పార్టీ జెండా ఆవిష్కరించాలని సూచించారు. కరోనా నేపద్యంలో ఈ ఏడాది పార్టీ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించలేకపోతున్నామని చెప్పారు.
కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించి, రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో ముందుకు తీసుకెళ్తున్నామని… రేపు జెండా ఎగురేసి మన ఆత్మగౌరవాన్ని మరో మారు చాటుదామని పార్టీ శ్రేణులకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.