కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. వివరాల ప్రకారం.. కలబురిగి జిల్లా కమలాపురలో ప్రైవేటు బస్సు అటుగా వెళ్తున్న ఓ ట్రక్కుని ఢీకొట్టి బస్సు బోల్తాపడగా మంటలు చెలరేగాయి. తక్కువ సమయంలోనే మంటలు బస్సు మొత్తం వ్యాపించడంతో నలుగురు అక్కడిక్కడే సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మరో నలుగురు మృతి చెందారు. బస్సు గోవా నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బీదర్-శ్రీరంగపట్టణం హైవేపై కమలాపుర వద్ద ఈ రోజు (శుక్రవారం) ఉదయం 6 గంటల ప్రాంతంలో దుర్ఘటన చోటుచేసుకుంది. మృతుల పేర్లు.. అర్జున్ (37), సరళ(32), బి.అర్జున్(5), శివకుమార్(35), రవళి(30), దీక్షిత(9), అనిత(40). బాధితులంతా హైదరాబాద్ వాసులుగా గుర్తించారు