Sunday, June 7, 2026
Homeసినిమామంత్రి చేతుల మీదుగా ‘సాచి’ ప్రారంభం

మంత్రి చేతుల మీదుగా ‘సాచి’ ప్రారంభం

Sachi:  సత్యానంద్ స్టార్ మేకర్స్ సమర్పణలో విధాత ప్రొడక్షన్ పతాకంపై సంజన, మూలవిరాట్ అశోక్ రెడ్డి నటీనటులుగా వివేక్ పోతిగేని దర్శకత్వంలో ఉపేన్ నడిపల్లి యాదార్థ సంఘటనల ఆధారంగా నిర్మిస్తున్న చిత్రం “సాచి”.తెలుగు, తమిళ్,, మలయాళం, కన్నడ, బాషలలో నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని అన్నపూర్ణ లో సినీ ప్రముఖుల మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆర్టిస్ట్ బిందుపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, నిర్మాత రామ్ మెహన్ రావు గౌరవ దర్శకత్వం వహించగా, సత్యానంద్ మాస్టర్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.

అనంతరం ఏర్పాటుచేసిన పాత్రికేయులు సమావేశంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… తెలంగాణ ప్రాంతంలోని ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి నిజజీవిత సంఘటనల ఆధారంగా తీసుకొని ఈ సినిమా తీయడం జరిగింది. దర్శకుడు వివేక్ పోతిగేని అమెరికాలో స్థిరపడ్డా తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది అని తెలుసుకుంటూ వారి తండ్రి గారి కోరిక మేరకు తెలుగులో దర్శకుడు అవ్వాలనే కోరికతో  ఇక్కడకు వచ్చారు. అమెరికాలో కొన్ని షార్ట్ ఫీలిమ్స్ తీస్తూ జన్మనిచ్చిన గడ్డ పైన సినిమా తీయాలని నిజ జీవితానికి దగ్గరగా ఉన్నటువంటి “సాచి” కథను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి ప్రజలను చైతన్యవంతులను చేయాలనే ప్రయత్నం చాలా మంచిది. మంచి కాన్సెప్ట్ తో తీస్తున్న సినిమా పెద్ద విజయం సాధించాలి. ఇలాంటి సినిమాలు భావితరానికి చాలా అవసరం” అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular