Saturday, November 23, 2024
HomeTrending Newsవ్యవసాయ యంత్రాలకు నేడు సిఎం శ్రీకారం

వ్యవసాయ యంత్రాలకు నేడు సిఎం శ్రీకారం

Farmer Friendly: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు గుంటూరు జిల్లలో పర్యటించనున్నారు. చుట్టుగుంట సెంటర్‌లో డాక్టర్‌ వైయస్‌ఆర్‌ యంత్ర సేవా పథకం ద్వారా ట్రాక్టర్‌లను, హర్వెస్టర్‌లను జెండా ఊపి ప్రారంభిస్తారు. అనంతరం కొండవీడు చేరుకుని జిందాల్‌ ప్లాంటు సమీపంలో ఏర్పాటుచే సిన హరిత నగరాలు నమూనాను ఆవిష్కరిస్తారు. తర్వాత్జ జిందాల్‌ వేస్ట్‌ టూ ఎనర్జీ ప్లాంట్‌ పైలాన్‌ ఆవిష్కరించి, ప్లాంట్‌ను లాంఛనంగా ప్రారంభిస్తారు.

యంత్ర సేవా కేంద్రాల ద్వారా రైతు గ్రూపులకు ట్రాక్టర్లు, కంబైన్డ్ హార్వెస్టర్లను పంపిణీ చేస్తారు. వీటి ద్వారా తక్కువ అద్దెకే వ్యవసాయ యంత్రాలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 3,800 ట్రాక్టర్లు, 320 కంబైన్డ్ హార్వెస్టర్లు అందించనున్నారు. 5,262 రైతు గ్రూపు బ్యాంక్ ఖాతాలకు రూ. 175.61 కోట్ల సబ్సిడీని జమ చేయనున్నారు.  ఆర్బీకే స్థాయిలో ఒక్కొక్కటి రూ. 15 లక్షల విలువ గల 10,750 వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. వరి ఎక్కువగా పండించే 20 జిల్లాల్లో ఒక్కొక్కటి రూ. 25 లక్షల విలువ గల కంబైన్డ్ హార్వెస్టర్లతో కూడిన 1,615 క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. రైతు గ్రూపులే ఈ యంత్ర సేవా కేంద్రాలు నిర్వహిస్తాయి.

రేపు ఉదయం 10.00 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం, 10.40 గంటలకు గుంటూరు చుట్టుగుంట సెంటర్‌లో ఏర్పాటుచేసిన సభావేదిక వద్దకు చేరుకుంటారు. 10.45 – 11.30 గంటల వరకు డాక్టర్‌ వైయస్‌ఆర్‌ యంత్ర సేవా పథకం ద్వారా అందజేసిన ట్రాక్టర్‌లను, హర్వెస్టర్‌లను జెండా ఊపి ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు పల్నాడు జిల్లా కొండవీడు చేరుకుని జిందాల్‌ ప్లాంటు సమీపంలో ఏర్పాటుచేసిన హరిత నగరాలు నమూనాని ఆవిష్కరిస్తారు. 12.15 – 12.30 గంటల మధ్య జిందాల్‌ వేస్ట్‌ టూ ఎనర్జీ ప్లాంట్‌ పైలాన్‌ ఆవిష్కరించి, ప్లాంట్‌ను ప్రారంభిస్తారు. కార్యక్రమం అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 1.05 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్