Mokshagna:  నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ‌.. త‌న‌యుడు మోక్ష‌జ్ఞ ఎంట్రీ గురించి ఎప్పుడు అడిగినా స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు ఖ‌చ్చితంగా చెబుతాను అని చాలా సార్లు చెప్పారు. చిరంజీవి త‌న‌యుడు చ‌ర‌ణ్‌, నాగార్జున త‌న‌యుడు నాగ‌చైత‌న్య‌, అఖిల్ హీరోగా సినిమాలు చేస్తుండ‌డంతో బాల‌య్య త‌న‌యుడు మోక్ష‌జ్ఞ ఎంట్రీ  గురించి గ‌త కొంత‌కాలంగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. బాల‌య్య మాత్రం మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఎవ‌రితో..? ఎప్పుడు.? అనేది మాత్రం ప్ర‌క‌టించ‌లేదు.

అయితే.. ఈమ‌ధ్య మ‌ళ్లీ మోక్ష‌జ్ఞ ఎంట్రీ అనేది వార్త‌ల్లోకి వ‌చ్చింది. స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడితో మోక్ష‌జ్ఞ తొలి సినిమా ఉంటుంద‌ని జోరుగా వినిపించింది. ఇదే విష‌యం గురించి అనిల్ రావిపూడిని అడిగితే… త‌న త‌దుప‌రి చిత్రం బాల‌కృష్ణ గారితో ఉంటుంది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతుంది. త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళుతుంది. ఈ సినిమాలో బాల‌య్య‌ను స‌రికొత్త‌గా చూపిస్తున్నాను. బాల‌య్య స్టైల్ యాక్ష‌న్ ఉంటుంది అలాగే త‌న స్టైల్ కామెడీ ఉంటుంద‌ని.. అంద‌రికీ న‌చ్చేలా ఈ సినిమా ఉంటుంది అన్నారు.

అయితే.. మోక్ష‌జ్ఞ‌తో సినిమా గురించి మాత్రం నాకు తెలియ‌దు. ఆలోచ‌న కూడా లేదు. మ‌రి.. బాల‌కృష్ణ గారు ఎవ‌రి డైరెక్ష‌న్ లో మోక్ష‌జ్ఞ‌తో సినిమా చేయ‌నున్నారో తెలియ‌దు. అంద‌రిలాగే నేను కూడా మోక్ష‌జ్ఞ ఫ‌స్ట్ మూవీ కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పారు అనిల్ రావిపూడి. దీంతో మోక్ష‌జ్ఞ తొలి చిత్రానికి అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం లేద‌ని క్లారిటీ వ‌చ్చింది. మ‌రి.. బాల‌య్య మోక్ష‌జ్ఞ తొలి చిత్రం బాధ్య‌త‌ను ఎవ‌రికి అప్ప‌గిస్తారో చూడాలి.

Also Read : మోక్ష‌జ్ఞ ఎంట్రీకి డైరెక్ట‌ర్ ఫిక్స్?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *