శ్రీలంక ఆర్థిక పతనం తర్వాత మరి కొన్ని దేశాలు రుణభారం, ఆహార కొరతతో సంక్షోభంలో చిక్కుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వరల్డ్ బ్యాంక్, IMF తాజా నివేదికలు ఆందోళన కలిగించే అంశాలను వెల్లడించాయి. కోవిడ్ మహమ్మారి నుంచి తేరుకోకముందే రష్యా ఉక్రెయిన్ పై దాడికి దిగడం డజనుకు పైగా దేశాల ఆర్ధిక వ్యవస్థలను కుదేలు చేసాయి. రష్యా, ఉక్రెయిన్ల నుంచి గోధుమలు, సన్ ఫ్లవర్ వంటనూనె దిగమతులపై ఆధారపడిన ఈజిప్ట్ ప్రమాదపు అంచుల్లో ఉంది. గల్ఫ్ దేశాల నుంచి డాలర్ల రూపంలో ఆర్థిక సాయం అందుతున్నా ఆహార కొరత ఆందోళన కలిగిస్తోంది. ట్యునీషియా, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, బుర్కినో ఫాసో, మాలి అండ్ ఛాద్, కెన్యా, ఇథియోపియా, ఎల్ సాల్వడార్, అర్జెంటీనా, పెరూ దేశాలు పెరిగిన ఆయిల్ ధరలు, తిండి గింజల కొరతను ఎదుర్కొంటున్నాయి.
ఇటీవల తుర్కియోగా పేరు మార్చుకున్న టర్కీ కూడా ఆహార కొరతకు దగ్గరగా చేరింది. మరో ఏడాది పాటు సరిపడా నిల్వలున్నాయని ఆదేశ అధ్యక్షుడు ఎర్డోగాన్ గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. యుద్ధం మరో ఆరు నెలల పాటు కొనసాగితే 50 దేశాల ఆర్థిక వ్యవస్థలు కోలుకోలేని రీతికి చేరుకుంటాయి. ద్రవ్యోల్భణం అదుపు లేకుండా దూసుకుపోతుండటం వల్ల దెబ్బతిన్న దేశాలు కోలుకోవడానికి పదేళ్లకు పైగా సమయం పడుతుందని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.
Also Read : శ్రీలంక చరిత్రలోనే గడ్డు రోజులు