Saturday, March 14, 2026
Homeస్పోర్ట్స్నార్వే చెస్: ఆరో రౌండ్ లో ఆనంద్ డ్రా

నార్వే చెస్: ఆరో రౌండ్ లో ఆనంద్ డ్రా

Today Draw:  భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్  నార్వే చెస్ టోర్నమెంట్ క్లాసికల్ విభాగం ఆరో రౌండ్ డ్రా అయ్యింది. నెదర్లాండ్స్ ఆటగాడు అనీష్ గిరి తో జరిగిన నేటి రెగ్యులర్ మ్యాచ్ లో 35 ఎత్తుల వద్ద ఇద్దరూ కరచాలనం చేసుకొని డ్రాగా ముగించారు. అనంతరం జరిగిన సడన్ డెత్ మ్యాచ్ లో 45 ఎత్తుల వద్ద ఇద్దరూ ఆటను డ్రా గా చేసుకున్నారు. అయితే సడన్ డెత్ రూల్స్ ప్రకారం మ్యాచ్ డ్రా అయినప్పటికీ నలుపురంగు కాయిన్స్ ఆడుతున్నవారిని విజేతగా భావిస్తారు.

ఈ రౌండ్ తర్వాత పదకొండున్నర పాయింట్లతో ఆనంద్ రెండో స్థానానికి దిగజారాడు. కార్ల్ సేన్ పన్నెండున్నర పాయింట్లతో  మొదటి స్థానానికి ఎగబాకాడు.

ఆనంద్ తన తరువాతి ఏడు, ఎనిమిది రౌండ్లలో అజెర్ బాయిజాన్ ఆటగాళ్ళు తైమూర్,  షక్రియార్ లతో తలపడనున్నాడు. చివరి, తొమ్మిదో రౌండ్ లో నార్వే ఆటగాడు తారి ఆర్యన్ తో డీ కొంటాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular