Thursday, June 11, 2026
Homeసినిమారేపటి గురించిన భయం లేదు: సాయిపల్లవి    

రేపటి గురించిన భయం లేదు: సాయిపల్లవి    

No worries: గ్లామరస్ గా కనిపిస్తేనే  .. స్కిన్ షో చేస్తేనే కథానాయికగా నిలదొక్కుకోవడం సాధ్యమవుతుందనే అభిప్రాయాలకు చెక్ పెట్టిన అతికొద్దిమంది కథానాయికలలో సాయిపల్లవి ఒకరు. సాయిపల్లవి కొంతమంది కథానాయికల కంటే అందగత్తె కాకపోవచ్చును గానీ .. ఆమెలో ఏదో ప్రత్యేకమైన ఆకర్షణ కనిపిస్తుంది. ఆమె నటనలోని సహజత్వం ఆమెకి ఎంతోమంది అభిమానులను సంపాదించిపెట్టింది. ఆకర్షణ .. అభినయం .. అంతకుమించిన వ్యక్తిత్వంతో సాయిపల్లవి ఆకట్టుకుంటోంది. ఆమె తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘విరాటపర్వం’ రెడీ అవుతోంది.

తాజా ఇంటర్వ్యూలో సాయిపల్లవి మాట్లాడుతూ .. ” తమిళనాడులోని  ఓ మారుమూల ప్రాంతం మాది. మొదటి నుంచి కూడా నాకు మెడిసిన్ చేయాలని ఉండేది . డాన్స్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. అందువలన ఆ రెండింటిపై దృష్టిపెడుతూ వచ్చాను. మలయాళంలో ‘ప్రేమమ్’ సినిమాతో పరిచయమయ్యాను. ఆ తరువాత తెలుగు ఇండస్ట్రీకి వచ్చాను. తెలుగు ప్రేక్షకులు నాకు  సూపర్ హిట్లు ఇచ్చారు. వరుసగా తెలుగు సినిమాలు చేయడం వలన నాకు తెలుగు బాగానే వచ్చింది .. నా పాత్రలకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటున్నాను.

మా ఇంట్లో నేను తెలుగులో మాట్లాడటం చూసి, మా పేరెంట్స్ ఆశ్చర్యపోతున్నారు. తెలుగు అబ్బాయినే పెళ్లి చేసుకో అంటున్నారు. వచ్చే ఏడాదిలో పెళ్లి చేసుకుని .. నాకు 30 ఏళ్లు వచ్చే సరికి ఇద్దరి పిల్లలను కనాలని ఉంది. నాకు నచ్చిన పాత్రలు వచ్చినంత కాలం నటిస్తూనే ఉంటాను. రేపటి రోజున అవకాశాలు రాకపోతే  ఎలా? అనే భయం నాకు లేదు. మెడిసిన్ చేశాను గనుక ఆ వైపు వెళతాను” అంటూ చెప్పుకొచ్చింది.

Also Read : సాయిపల్లవికి గల క్రేజ్ అలాంటిది మరి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular