Friday, March 6, 2026
Homeసినిమాయాంకర్ శ్యామల భర్త పై చీటింగ్ కేసు

యాంకర్ శ్యామల భర్త పై చీటింగ్ కేసు

యాంకర్ శ్యామల భర్త నర్సింహారెడ్డిపై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదైంది. నర్సింహారెడ్డి కోటి రూపాయలు తీసుకొని తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడని ఓ సింధూర రెడ్డి అనే మహిళలు ఫిర్యాదు చేసింది. 2017 నుండి ఇప్పటి వరకు విడతల వారీగా డబ్బు తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. డబ్బుల విషయం అడిగితే యాంకర్ శ్యామల భర్త నర్సింహారెడ్డి బెదిరింపులకు దిగినట్లుగా తెలిపింది. డబ్బులు తీసుకోవడమే కాకుండా లైంగిక వేధింపులకు సైతం పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. కాగా సెటిల్ మెంట్ చేసుకోవాలంటూ ఈ కేసులో నర్సింహారెడ్డి తరపున మరో మహిళ రాయబారం నడిపినట్లుగా తెలిపింది. ఈఇష్యూపై కేసు 138/2021,u/sec420,354D,504,506,384,r/w34ipc కింద నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు.. నర్సింహారెడ్డితో పాటు రాయబారం నడిపిన మహిళను రిమాండ్ కి తరలింపుతో ఆసక్తి నెలకొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular