భారత్లో కొవిడ్ కేసులు భారీగా పెరిగాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 8,822 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం 5,718 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.66 శాతానికి చేరింది. మృతుల సంఖ్య 1.21 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.12 శాతం వద్ద ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 2 శాతంగా ఉంది.
మొత్తం కరోనా కేసులు: 43,245,517
మొత్తం మరణాలు: 5,24,792
యాక్టివ్ కేసులు: 53,637
కోలుకున్నవారి సంఖ్య: 4,26,67,088
Also Read : మళ్లీ కొవిడ్ ప్రమాద ఘంటికలు