Monday, June 15, 2026
Homeస్పోర్ట్స్పురుషుల హాకీ: ఇండియాపై నెదర్లాండ్స్ షూటౌట్

పురుషుల హాకీ: ఇండియాపై నెదర్లాండ్స్ షూటౌట్

India lost: ప్రోలీగ్ పురుషుల హాకీ టోర్నీలో నేడు జరిగిన మ్యాచ్ లో ఇండియాపై నెదర్లాండ్స్ షూటౌట్ లో విజయం సాధించింది. నిర్ణీత సమయంలో చెరో రెండు గోల్స్ చేయడంతో షూటౌట్ కు వెళ్ళాల్సి వచ్చింది.

10వ నిమిషంలో నెదర్లాండ్స్ తొలి గోల్ నమోదు చేసింది. ఇండియా ఆటగాడు దిల్ ప్రీత్ సింగ్ 22వ నిమిషంలో తొలి గోల్ అందించి స్కోరు సమం చేశాడు. ఆట చివరి భాగం మొదట్లో 47వ నిమిషం వద్ద నెదర్లాండ్స్ మరో గోల్ చేసి 2-1 ఆధిక్యం సంపాదించింది. అయితే ఆట చివరి క్షణాల్లో హర్మన్ ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్ ను గోల్ గా మలిచి స్కోరు సమం చేశాడు.

షూటౌట్ లో నెదర్లాండ్స్ వరుస నాలుగు ప్రయత్నాల్లో సఫలం అయ్యింది. ఇండియా కేవలం మూడో ప్రయత్నం మాత్రమే గోల్ సాధించగలిగింది, దీనితో నెదర్లాండ్స్ పైచేయి సాధించింది. ఈ టోర్నీలో చివరి మ్యాచ్ ను ఇండియా రేపు నెదర్లాండ్స్ తోనే ఆడనుంది. పాయింట్ల పట్టికలో నెదర్లాండ్స్ అగ్రస్థానంలో ఉండగా, ఇండియా మూడో స్థానంలో ఉంది. బెల్జియం రెండో స్థానంలో కొనసాగుతోంది.

ఇండియా హాకీ జట్టుకు ఈ టోర్నీ టైటిల్ గెల్చుకునే అవకాశాలు దాదాపు లేనట్లే నని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular