Cabinet Brief: జగనన్న అమ్మ ఒడి పథకం అమలుకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ఏడాది 43 96,402 మంది తల్లులకు 6,594.6 కోట్ల రూపాయలు పంపిణీ చేయనున్నారు. కొత్తగా 5,48,329మంది తల్లులు ఈ పథకానికి అర్హత సాధించారు. ఈనెల ఈ పథకం ద్వారా ప్రస్తుత విద్యా సంవత్సరంలో 82, 31,502 మంది విద్యార్ధులు లబ్ధి పొందనున్నారు. నేడు సిఎం వైఎస్ జగన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశమైంది. మంత్రివర్గ నిర్ణయాలను సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ మీడియాకు వెల్లడించారు.
కేబినేట్ నిర్ణయాల్లో ముఖ్యాంశాలు:
- జూలై 5న విద్యా కానుక, 13 వైఎస్సార్ వాహన మిత్ర, 19న జగనన్న తోడు; 22 వైఎస్సార్ కాపునేస్తం, పథకాల అమలు
- వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు 216.71 కోట్ల రూపాయలు విడుదల
- యూనివర్సిటీలు, కార్పోరేషన్ సొసైటీ ఉద్యోగులకు పీఆర్సీ వర్తింపు
- ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖకు గ్రూప్ 1 ఉద్యోగం
- విజయనగరం, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల లో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల్లో 3530 ఉద్యోగాల నియామకానికి గ్రీన్ సిగ్నల్
- 10 ఎకరాల సాగు చేసే ఆక్వా రైతులకు కూడా విద్యుత్ సబ్సిడీ
- గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు ప్రాజెక్టు కింద 3700 మెగావాట్ల హైడ్రో పంప స్టోరేజ్ ప్రాజెక్టుకు ఆమోదం
కోన సీమ జిల్లా పేరును డా. అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్పుకు ఆమోదం - జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ ఎంఐజీ లే ఔట్ల అభివృద్ధికి ప్రైవేటు సంస్థలకు అనుమతి
- ఛారిటబుల్ సంస్థలకు లీజు కాలం పొడిగింపు
- జిల్లాల పునర్విభజన నేపథ్యంలో పాత 13 జిల్లాల జడ్పీ ఛైర్మన్ లను 26 జిల్లాలకు నియమిస్తూ పంచాయతీరాజ్ చట్టం సవరణ
- స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ తీసుకున్న నిర్ణయాలకు కేబినేట్ ఆమోదం
- రాజ్ భవన్ కు 100 పోస్టులు మంజూరు, సర్వీస్ రూల్స్ ఏర్పాటుకు ఆమోదం
- హరే కృష్ణ ఫౌండషన్ కు స్టాప్ డ్యూటీ మినహాయింపు