Friday, March 29, 2024
HomeTrending Newsఅమ్మ ఒడిపై దుష్ప్రచారం తగదు : మంత్రి సురేష్

అమ్మ ఒడిపై దుష్ప్రచారం తగదు : మంత్రి సురేష్

Don’t mislead: అమ్మఒడి పథకం అర్హతకు సంబంధించి కొత్తగా నియమావళి రూపొందించలేదని, గతంలో కంటే ఇంకా ఎక్కువమందికి అవకాశం కల్పించడంకోసం నిబంధనలు సడలించామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. ఈ పథకంపై తెలుగుదేశం, ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. హైదరాబాద్ లో సురేష్ మీడియా సమావేశంలో మాట్లాడారు.

అమ్మ ఒడి పథకంపై ఎల్లో మీడియా గగ్గోలు పెడుతోందని, కానీ మీరు ఎంత గగ్గోలు పెట్టినా ప్రజలు జగన్‌ పాలనపై పూర్తి విశ్వాసంతో ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. లోకేష్‌ విమర్శలు చేస్తున్నారని, మరోవైపు ఎల్లో మీడియాలో దీనిపై అసత్యాలు వండి వారుస్తూ, అమ్మ ఒడి పథకంపై తప్పుడు కథనాలు ఇస్తున్నారని మండిపడ్డారు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దేవారికి ఈ పథకం అర్ధం కాదంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.

ఆదిమూలపు మీడియాతో మాట్లాడిన ముఖ్యాంశాలు:

  • ‘అమ్మ ఒడి’ నిబంధనలు మారలేదు. చూసే కళ్లే మారాయి
  • విద్యుత్‌ వినియోగ పరిమితిని 200 నుంచి 300 యూనిట్లకు పెంచాం
  • విద్యార్థుల 75 శాతం హాజరు కూడా పాత నిబంధనే. అయినా అక్కసుతోనే ఎల్లో పత్రికల రాతలు
  • మొన్నటి వరకు విద్యా శాఖ నేనే చూశాను
  • తొలి ఏడాది తర్వాత 2020–21లో ఇంకా ఎక్కువ మందికి ఇచ్చాం
  • ఆ మేరకు అప్పుడు వార్షిక ఆదాయం, భూకమతం పరిమితి పెంచాం
  • పట్టణాల్లో ఇంటి విస్తీర్ణం పరిమితినీ పెంచాం
  • దాంతో రెండో ఏడాది అదనంగా 2,15,767 మంది తల్లులకు లబ్ధి
  • 2019–20లో 42,33,098 మంది తల్లుల ఖాతాల్లో నగదు జమ
  • 2020–21లో 44,48,865 మంది తల్లులకు ఆర్థిక సాయం
  • ఈ ఏడాది ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది
  • ఈ రెండేళ్లలో రూ.13 వేల కోట్లు తల్లుల ఖాతాల్లో జమ చేశాం
  • తొలి రెండేళ్లు విద్యార్థుల హాజరుపై నిబంధన సడలింపు ఇచ్చాం
  • ఈ ఏడాది 75 శాతం హాజరు తప్పనిసరి చేస్తూ కొత్త జీఓ  తెచ్చాం
  • అంతే తప్ప పథకం అర్హులలో కోత విధించడం దీని ఉద్దేశం కాదు
  • దేశంలో ఎక్కడా లేని విధంగా అమ్మ ఒడి పథకం… నిరుపేద కుటుంబాల పిల్లలకు మంచి విద్యావకాశం
  • వారూ ఎదగాలన్నదే సీఎం జగన్‌ సంకల్పం
  • నారాలోకేష్, ఎల్లో మీడియా అదేపనిగా దుష్ప్రచారం చేస్తూ అసత్య ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు
  • ఇకనైనా వాస్తవాలు తెలుసుకోండి. విషం చిమ్మొద్దు

Also Read : ఎల్లో మీడియాని బహిష్కరించాలి: సజ్జల

RELATED ARTICLES

Most Popular

న్యూస్