Monday, May 20, 2024
HomeTrending Newsవిదేశాంగ విధానానికి జై శంకర్ కొత్త భాష్యం

విదేశాంగ విధానానికి జై శంకర్ కొత్త భాష్యం

Indian Foreign Policy :

ప్రపంచవ్యాప్తంగా విదేశాంగ విధానం ఎలా ఉండాలో భారత్ ని చూసి నేర్చుకోవాలి అనేంతగా ప్రభావితం చేస్తున్న వ్యక్తి  సుబ్రహ్మణ్యం జై శంకర్. చైనా,రష్యా,అమెరికా, యూరోపు ఇలా అవతలి వాళ్ళు ఎంత పెద్దవాళ్ళయినా తన సమాధానాలతో సంతృప్తపరచగలడు లేదా అదే సమయంలో ధీటుగా సమాధానం ఇవ్వగలడు. రష్యా నుండి క్రూడ్ ఆయిల్ కొనవద్దు అంటూ US స్టేట్ ఆఫ్ సెక్రటరీ అయిన అంటోనీ బ్లిన్ కెన్ ని న్యూ డిల్లీ పంపించింది అమెరికా !

ముఖాముఖీ చర్చల అనంతరం విలేఖరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అమెరికన్ జర్నలిస్ట్ ఒకరు ‘రష్యా మీద అమెరికా ఆంక్షలు విధించినా మీరు ఎందుకు క్రూడ్ ఆయిల్ కొంటున్నారు’ అని అడిగాడు దానికి జవాబుగా జై శంకర్ మేము మా అవసరాల కోసం కొనే క్రూడ్ ఆయిల్ రెండు నెలలకి సరిపోతుంది కానీ యూరోపు అదే మొత్తం ఆయిల్ ని ఒక పూటలో కొంటున్నది రష్యా నుండి ! విలేఖరితో పాటు అక్కడే ఉన్న బ్లింకెన్ ముఖం మాడిపోయింది. జై శంకర్ నుండి ఇలాంటి సమాధానం వస్తుందని ఊహించని అమెరికన్ విలేఖరి విస్తుపోయాడు ! ఇదివరకు కూడా ఇలాంటి సమావేశాలు జరిగాయి. కానీ అమెరికన్ మీడియాకి మన ప్రతినిధులు చాల సౌమ్యంగా సమాధానం ఇచ్చేవారు వినయంగా ఎందుకంటే అది అమెరికా కదా ? యూరోపు మాత్రం తమ అవసరాలని ఒదులుకోలేదు కానీ అవతలి వాళ్ళు, వాళ్ళ వాళ్ళ అవసరాలని ఒదిలేసుకోవాలి వీళ్ళని సంతృప్తి పరచడం కోసం !
సాధారణంగా మాట వినని దేశాల మీద అమెరికా ప్రయోగించే మరో అస్త్రం పేరు మానవహక్కుల ఉల్లంఘన ! ఆ పేరుతో ఎదో విధంగా ఆంక్షలు విధించడం పరిపాటి ! ఈ సారి కూడా అంటోని బ్లిన్కెన్ అదే అస్త్రాన్ని ప్రయోగించాలని చూశాడు. భారత్ లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతున్నట్లు మా దృష్టికి వచ్చింది అంటూ సన్నాయి నొక్కులు నొక్కాడు. బ్లింకెన్ కి జై శంకర్ బీ ఫిట్టింగ్ రిప్లై ఇచ్చాడు. మానవ హక్కుల ఉల్లంఘన అనేవి ఎదో కొన్ని దేశాలకి పరిమితం కాదు అన్ని దేశాలలోనూ జరుగుతున్నాయి కానీ ఆ సంఘటనల వెనుక వ్యక్తిగత కారణాలు కూడా ఉండవచ్చు అయితే భారత దేశం ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉందన్నారు. మానవ హక్కుల మీద భారత్ కి మంచి అవగాహన ఉంది కూడా ! అమెరికా లో కూడా మానవహక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయి అది మేము గమనిస్తున్నాము అని జావాబు ఇచ్చాడు జై శంకర్.

జై శంకర్ మాటల వెనక ఉన్న మర్మం ఏమిటో బ్లింకెన్ కి బాగానే అర్ధమయ్యింది ఎందుకంటే గత 10 రోజుల వ్యవధిలో న్యూయార్క్ నగరంలో వరుసగా ఇద్దరు సిక్కుల మీద దాడులు జరిగాయి. ఇద్దరినీ బాగా కొట్టి వాళ్ళ దగ్గర నుండి డబ్బు తో పాటు ఖరీదయిన వాచీలు దోపిడీ చేసారు. పరోక్షంగా జై శంకర్ ఈ ఘటనలనే బ్లింకెన్ ముందు ప్రస్తావించారు. మనకి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఏ విదేశాంగ మంత్రి కూడా ఈ విధంగా దీటుగా మొఖం మీద కొట్టినట్లు సమాధానం ఇవ్వలేదు అమెరికాకి. నల్లజాతి వాళ్ళ మీద చూపిస్తున్న జాతి వివక్ష వల్లనే కదా పోయిన సంవత్సరం అమెరికా అట్టుడికి పోయింది ? వీళ్ళు ఎవరికి సుద్దులు చెప్తున్నారు ?
ఇంతకీ విదేశాంగ మంత్రి  జై శంకర్ ఎవరు ? ప్రధానమంత్రి మోదీ ఎందుకింత ప్రాముఖ్యత ఇస్తున్నారు? Dr. జై శంకర్ జపాన్ దేశానికి చెందిన క్యోకో [Kyoko] అనే యువతిని వివాహం చేసుకున్నారు. వీరికి ధ్రువ, అర్జున్ అనే ఇద్దరు కుమారులు…మేధా అనే కుమార్తె ఉన్నది.  జై శంకర్  K.సుబ్రహ్మణ్యం అనే మాజీ IAS ఆఫీసర్ కుమారుడు. సుబ్రహ్మణ్యం మన దేశ అణు విధానానికి రూపకర్త,సిద్ధాంత కర్త. అణు విద్యుత్ రంగానికి మన దేశం తరుపున రాయబారిగా వ్యవహరించిన మేధావి. తన బాచ్ లో టాపర్ కూడా. Dr. జై శంకర్ తమిళ, హిందీ,ఇంగ్లీష్,రష్యన్,జపనీస్,చైనీస్ భాషలలో ప్రావీణ్యం ఉంది. హంగేరియన్ భాషలో ప్రవేశం ఉంది.

IFS ఆఫీసర్ అయిన జై శంకర్ మొదటగా 1977 లో సర్వీసులో జాయిన్ అయ్యారు. 1979 నుండి 1981 వరకు అప్పటి సోవియట్ యూనియన్ లో ఇండియన్  మిషన్  టు సోవియట్ యూనియన్ లో మొదట మూడవ సెక్రటరీగా తరువాత రెండవ సెక్రటరీ గా భారత్ తరుపున పనిచేసారు. ఆ కాలంలోనే రష్యన్ భాష నేర్చుకున్నారు జై శంకర్గ. అక్కడి నుంచి న్యూ డిల్లీ వచ్చి అప్పటి ప్రముఖ దౌతవేత్తగా పేరున్న గోపాలస్వామి పార్ధసారధి దగ్గర అండర్ సెక్రటరీగా పనిచేసారు అది అమరికా డివిజన్ ఆఫ్ ఇండియాస్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టేర్నల్ అఫైర్స్ [Americas division of India’s Ministry of External Affairs] లో నేరుగా అమెరికా వ్యవహరాహాల మీద అన్నమాట. గోపాలస్వామి పార్ధసారధి టీమ్ లో ఉంటూ అమెరికా మన దేశంలోని తారాపూర్ అణు విధ్యత్ కేంద్రానికి కావాల్సిన అణు ఇంధనాన్ని సప్లై చేయడానికి జరిగిన ఒప్పందం లో పనిచేసారు.
1985 to 1988 వరకు అమెరికా లోని వాషింగ్టన్ లో ఉన్న భారత రాయబార కార్యాలయంలో first సెక్రటరీ గా పనిచేసారు.


2014 లో బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత జై శంకర్ పని తీరు, అతనికి ఉన్న బహు భాషా పరిజ్ఞానంని దగ్గర నుండి చూసిన తరువాత ఒక ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారిని నేరుగా భారత విదేశాంగ మంత్రిగా నియమించారు మోడీ. మోదీ నిర్ణయం వృధా కాలేదు గొప్ప ఫలితాలని ఇచ్చింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జై శంకర్ పేరు దౌత్య వర్గాలలో చర్చనీయాంశం అయ్యింది.  దాని వెనుక జై శంకర్ మోదీజీ ఇచ్చిన స్వేచ్చ కూడా ఒక కారణం అయితే ఇచ్చిన బాధ్యతని తన శక్తి మేరకు నిర్వహిస్తున్న జై శంకర్ నిర్విరామ కృషి కూడా ఉంది.
ఇప్పుడు అర్ధమవుతున్నదా ? పుతిన్ తో నేరుగా రష్యన్ భాషలోనే మాట్లాడగలరు జై శంకర్ గారు అలాగే చైనా విదేశాంగ మంత్రితో మాండరిన్ భాషలో మాట్లాడగలరు అలాగే జపాన్ ప్రధాని లేదా జపాన్ విదేశాంగ మంత్రితో నేరుగా జపనీస్ భాషలో మాట్లాడగలరు. సుదీర్ఘకాలం భారత్ తరుపున వివిధ దేశాలలో దౌత్యవేత్తగా పని చేసిన అనుభవంకి తోడు తన తండ్రి అయిన మాజీ IAS అధికారి సుబ్రహ్మణ్యం శిక్షణతో పాటు అప్పట్లో ప్రముఖ దౌత్యవేత్త అయిన గోపాలస్వామి పార్ధసారధి శిష్యరికం వెరసి నేటి జై శంకర్ అన్నమాట.

మహా అయితే సీనియర్ డిప్లోమాట్ గా రిటైర్ అయ్యే  జై శంకర్,  మోదీ మంత్రివర్గంలోకి రావడం, తీసుకోవడం అనేది ఆయన అదృష్టంతో పాటు మన దేశ అదృష్టం అని కూడా చెప్పవచ్చు. ఇప్పటి మంత్రివర్గంలో ఇద్దరు ప్రముఖులు ఒకరు అజిత్ దోవల్ మాజీ IPS అధికారి, రెండోది  జై శంకర్ మాజీ IFS అధికారి. ఇద్దరూ కాబినెట్ రాంక్ స్థాయి వారే. ఇద్దరూ తమ తమ రంగాలలో అద్భుత ప్రతిభ చూపిస్తూ మన దేశ జెండాకి గౌరవం తెస్తున్నారు విదేశాలలో. దీని వెనుక మోదీ దూర ద్రుష్టి కూడా ఎంతో ఉంది. రాజకీయ నాయకులని నియమించకుండా ఆ రంగాలలో అనుభవం ఉన్నవారిని మంత్రులుగా ఎంచుకోవడం అనేది సాహసోపేతమయిన చర్య అవుతుంది.

Also Read : ఉత్తరాఖండ్ లో త్వరలోనే యూనిఫామ్ సివిల్ కోడ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్