ఆధునిక భారత నిర్మాత అంబేడ్కరే అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కొనియాడారు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన తాను ఈ స్థాయికి చేరడానికి ఆయన రాసిన రాజ్యాంగమే కారణమన్నారు. న్యూయార్క్‌లోని ప్రఖ్యాత కొలంబియా యూనివర్సిటీని ఆయన సందర్శించారు. ఇదే విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్‌కు చీఫ్ జస్టిస్ ఘన నివాళులు అర్పించారు. తొలుత కొలంబియా లా స్కూల్ డీన్ ఆడమ్ కోల్కరల్.. జస్టిస్ రమణకు సాదర స్వాగతం పలికారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో జస్టిస్ రమణ మాట్లాడుతూ.. ‘‘నేను సామాన్య రైతు కొడుకుని. అలాంటి నేను ఇప్పుడు ఇక్కడ భారత దేశ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ హోదాలో నిలబడ్డాను. ఇదంతా.. అంబేడ్కర్ రచించిన అత్యం త ప్రగతిశీల రాజ్యాంగం కారణంగానే సాధ్యమైంది. నాతోపాటు నాలాంటి లక్షల మంది ఆ దార్శనికుడికి ఎప్పటికీ రుణపడి ఉంటాం’’ అని పేర్కొన్నారు.
Also Read : భారతంలోనూ మధ్యవర్తిత్వం: జస్టిస్ రమణ