Title Talks: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ క్రేజీ మూవీలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ నటిస్తోంది. ఫస్ట్ టైమ్ శంకర్ తెలుగులో సినిమా చేస్తుండడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో చరణ్ రెండు విభిన్నమైన పాత్రలు పోషిస్తుండడంతో అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
అయితే… ఈ మూవీకి విశ్వంభర అనే టైటిల్ ఆలోచిస్తున్నారని వార్తలు వచ్చాయి. ఆతర్వాత అధికారి అనే టైటిల్ బాగా ప్రచారంలోకి వచ్చింది. ఈ టైటిల్ నే ఫిక్స్ చేస్తారని ప్రచారం జరిగింది. దిల్ రాజు ఈ టైటల్ ని ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేయించడంతో ఈ టైటిల్ నే కన్ ఫర్మ్ చేస్తారనుకున్నారు. అయితే.. ఇప్పుడు మరో టైటిల్ తెర పైకి వచ్చింది. అదే సిటిజన్. అధికారి టైటిల్ కన్నా.. సిటిజన్ టైటిల్ అయితేనే బాగా సూటవుతుందని శంకర్ భావిస్తున్నాడట.
దీంతో అధికారి, సిటీజన్ ఈ రెండు టైటిల్స్ లో ఏ టైటిల్ ను ఫైనల్ చేస్తారనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఈ పాన్ ఇండియా మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో శ్రీకాంత్, సునీల్, అంజలి, జయరామ్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. షూటింగ్ ఆలస్యం అవ్వడం వలన 2023 సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి.. చరణ్, శంకర్ కలిసి న్యూరికార్డులు సెట్ చేస్తారేమో చూడాలి.
Also Read : సల్మాన్ మూవీలో చరణ్..?