Friday, April 26, 2024
Homeసినిమాచ‌ర‌ణ్‌, శంక‌ర్ మూవీ స‌రికొత్త టైటిల్!

చ‌ర‌ణ్‌, శంక‌ర్ మూవీ స‌రికొత్త టైటిల్!

Title Talks: మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ క్రేజీ మూవీలో చ‌ర‌ణ్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ న‌టిస్తోంది. ఫ‌స్ట్ టైమ్ శంక‌ర్ తెలుగులో సినిమా చేస్తుండ‌డంతో ఈ మూవీపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఇందులో చ‌ర‌ణ్ రెండు విభిన్న‌మైన పాత్ర‌లు పోషిస్తుండ‌డంతో అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా వ‌స్తుందా అని ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు.

అయితే… ఈ మూవీకి విశ్వంభ‌ర అనే టైటిల్ ఆలోచిస్తున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఆత‌ర్వాత అధికారి అనే టైటిల్ బాగా ప్ర‌చారంలోకి వ‌చ్చింది. ఈ టైటిల్ నే ఫిక్స్ చేస్తార‌ని ప్ర‌చారం జరిగింది. దిల్ రాజు ఈ టైట‌ల్ ని ఫిల్మ్ ఛాంబ‌ర్ లో రిజిస్ట‌ర్ చేయించ‌డంతో ఈ టైటిల్ నే క‌న్ ఫ‌ర్మ్ చేస్తార‌నుకున్నారు. అయితే.. ఇప్పుడు మ‌రో టైటిల్ తెర పైకి వ‌చ్చింది. అదే సిటిజన్. అధికారి టైటిల్ క‌న్నా.. సిటిజ‌న్ టైటిల్ అయితేనే బాగా సూటవుతుంద‌ని శంక‌ర్ భావిస్తున్నాడ‌ట‌.

దీంతో అధికారి, సిటీజ‌న్ ఈ రెండు టైటిల్స్ లో ఏ టైటిల్ ను ఫైన‌ల్ చేస్తార‌నేది ఆస‌క్తిగా మారింది. ప్ర‌స్తుతం ఈ పాన్ ఇండియా మూవీ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఇందులో శ్రీకాంత్, సునీల్, అంజ‌లి, జ‌య‌రామ్, న‌వీన్ చంద్ర కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. షూటింగ్ ఆల‌స్యం అవ్వ‌డం వ‌ల‌న 2023 స‌మ్మ‌ర్ లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. మ‌రి.. చ‌ర‌ణ్‌, శంక‌ర్ క‌లిసి న్యూరికార్డులు సెట్ చేస్తారేమో చూడాలి.

Also Read స‌ల్మాన్ మూవీలో చ‌ర‌ణ్‌..?

RELATED ARTICLES

Most Popular

న్యూస్