పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో మౌలిక వసతులు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. పాక్ ప్రభుత్వం pok ప్రజల బాగోగులు పట్టించుకోవటంలేదని నిరసనకు దిగారు. ఖనిజ సంపాదకు నిలయమైన గిల్గిత్ బాల్టిస్తాన్ లో ప్రజలు ఆందోళనకు దిగారు. ఫ్రీ కాశ్మీర్ నినాదాలు చేస్తు స్కర్డు నగరంలో ప్రదర్శనలు నిర్వహించారు. యునైటెడ్ కాశ్మీర్ పీపుల్స్ నేషనల్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో వేల మంది పాల్గొన్నారు. ప్రదర్శనకారులు పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆక్రమిత కాశ్మీర్ లో ఖనిజ సంపద, విద్యుత్ ప్రాజెక్టులు స్థానుకుల కోసం వినియోగించకుండా ఇస్లామాబాద్ ప్రయోజనాల కోసం వాడుతున్నారని యునైటెడ్ కాశ్మీర్ పీపుల్స్ నేషనల్ పార్టీ నేత షౌకత్ అలీ కాశ్మీరీ ఆరోపించారు.
జెనివాలో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ సమావేశం జరగుతోంది. ఈ నేపథ్యంలో పాక్ ఆక్రమిత్ కాశ్మీర్ లో పాకిస్తాన్ ప్రభుత్వాల అరాచకాలను ప్రపంచానికి చాటి చెప్పడమే లక్ష్యంగా ఆందోళనలు నిర్వహిస్తున్నామని ఆందోళనకారులు పేర్కొన్నారు. పాకిస్తాన్ ఆర్మీ.. కాశ్మీర్ లో మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని, మహిళలపై లైంగిక దాడులు చేయటం.. వారిని ప్రశ్నిస్తే ఉగ్రవాదుల పేరుతో చంపేస్తున్నారని మానవ హక్కుల సంఘాలు ఆరోపించాయి. కాశ్మీర్ ప్రజలను బానిసలుగా చూస్తున్న పాకిస్తాన్ నుంచి కాశ్మీర్ కు స్వాతంత్ర్యం కావాలని ప్రదర్శనకారు డిమాండ్ చేశారు. కాశ్మీర్లో మహిళల అపహరణ పాక్ మిలిటరీ కనుసన్నల్లోనే జరుగుతోందని ఆందోళనకారులు ఆరోపించారు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో రోజుకు 20 గంటలపాటు విద్యుత్ ఉండటం లేదని, విద్య, వైద్య సౌకర్యాలు లేక నిరాశతో ఉన్న యువతను ఉగ్రవాదం వైపు మల్లిస్తున్నారని మానవహక్కుల నేతలు ఆరోపించారు. కాశ్మీర్ లో పాక్ అరాచకాలపై యుఎన్ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని వారు తెలిపారు.
Also Read : పాక్ లో మైనారిటీలపై పెరిగిన వేధింపులు