Friday, June 19, 2026
Homeసినిమా‘పక్కా కమర్షియల్’ సక్సెస్ సంబరాలు

‘పక్కా కమర్షియల్’ సక్సెస్ సంబరాలు

గోపీచంద్, రాశీఖ‌న్నా జంట‌గా న‌టించిన చిత్రం ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్. ఈ చిత్రానికి మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో స‌క్సెస్ ఫుల్ బ్యాన‌ర్లుగా అంద‌రి మ‌న్న‌న‌లు అందుకున్న జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ పతకాల పై బ‌న్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రపంచ వ్యాప్తంగా జులై 1 న థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ చిత్రం ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ కేక్ కట్ చేసి పాత్రికేయుల సమక్షంలో సక్సెస్ సంబరాలు ఘనంగా జరుపుకుంది.

అనంతరం చిత్ర దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. జులై 1న విడుదలైన “పక్కా కమర్సియల్” సినిమా మేము అనుకున్నట్లే అందరి ప్రేక్షకులను ఆకట్టుకుంటూ విజయవంతంగా ప్రదర్శింపబడుతుంది. నా సినిమాల్లో ఉండే ఎంటర్ టైన్మెంట్ ఈ సినిమాలో కూడా ప్లే చేయడంతో ఎక్కడా ఫన్ తగ్గకుండా చూసిన ప్రతి ఒక్కరూ బాగుందని మెసేజ్ లు పెడుతున్నారు. నా సినిమాకు వచ్చే ఆడియన్స్ ఏమి ఎక్స్ పెక్ట్ చేస్తారో అవన్నీ ఇందులో ఉన్నాయి. నా ప్రివియస్ సినిమాలను హిట్ చేసినట్లే ఈ సినిమాకు వచ్చి చూసి హిట్ చేశారు. వారందరికీ నా ధన్యవాదాలు.

అరవింద్ గారు నాతోఈ సినిమా విడుదలైన అన్నీ చోట్ల నుండి మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పడంతో నాకు చాలా హ్యాపీ అనిపించింది. ప్యాండమిక్ తరువాత వచ్చిన పెద్ద సినిమాల వచ్చాయి ఆ తర్వాత వచ్చిన చాలా సినిమాలకు ఆడియన్స్ థియేటర్ కు రావడం లేదు. అయితే.. ఇలాంటి ఆన్ సీజన్ టైమ్ లో కూడా ప్రేక్షకులు మా సినిమాను ఆదరించడంతో షో తరువాత షో కు కలెక్షన్స్ పెరుగుతూ వస్తున్నాయి. గోపీచంద్ ను చాలా రోజుల తరువాత బాగా చూపించారు.. రాశి ఖన్నా ట్రాక్ బాగుంది. రావు రమేష్ విలనిజం చాలా బాగుందని, మేము అనుకున్న దాని కంటే ఈ సినిమా బాగుందని చెపుతున్నారు. నాకిలాంటి మంచి సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మళ్ళీ ఇంకా బెటర్ కంటెంట్ తో మీ ముందుకు వస్తాను అన్నారు.

Also Read : pakka commercial Review: అంత కమర్షియల్ కాదు .. అంత కామెడీనూ లేదు! 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular