Thursday, March 28, 2024
Homeసినిమాసత్యదేవ్ ‘కృష్ణమ్మ’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

సత్యదేవ్ ‘కృష్ణమ్మ’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

Krishnamma: వైవిధ్యమైన పాత్రలు, సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని దక్కించుకున్న వర్సటైల్ హీరో సత్యదేవ్. ఆయ‌న‌ పుట్టినరోజు (జూలై 4) సందర్భంగా కొత్త సినిమా కృష్ణమ్మ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ మీద.. కృష్ణ కొమ్మలపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వీ వీ గోపాల కృష్ణ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.

ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇక ఇందులో సత్యదేవ్ ఎంతో పవర్ ఫుల్‌గా కనిపిస్తున్నారు. పోస్టర్‌లో ఆ కత్తి పట్టుకుని స‌త్య‌దేవ్ నిలుచుకున్నారు. మంచి, చెడుల కలయిక నది నడత… పగ, ప్రేమ కలయిక మనిషి నడక అనే ఓ భావం ఎలివేట్ అవుతుంది. కృష్ణమ్మ అనే టైటిల్ కూడా ఎంతో పవర్ ఫుల్‌గా అనిపిస్తోంది. ఇక ఈ యాక్షన్ మూవీకి సన్నీ కూరపాటి కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. కాళ భైరవ సంగీతాన్ని అందిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్‌గా, రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తవ్వగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సెప్టెంబ‌ర్‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో లక్ష్మణ్, కృష్ణ, అథిరా రాజ్, అర్చన, నంద గోపాల్, రఘు కుంచె, తారక్, సత్యం వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్