Monday, June 8, 2026
Homeసినిమాఅల్లూరి విజ‌యంపైనే శ్రీవిష్ణు ఆశలన్నీ!

అల్లూరి విజ‌యంపైనే శ్రీవిష్ణు ఆశలన్నీ!

Alluri:  వైవిధ్య‌మైన క‌థ‌ల‌తో సినిమాలు చేస్తున్న యంగ్ హీరో శ్రీవిష్ణు. అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు, నీదా నాది ఒక‌టే క‌థ‌, బ్రోచేవారెవ‌రురా.. త‌దిత‌ర చిత్రాల‌తో మెప్పించిన శ్రీవిష్ణు ఈమ‌ధ్య కాలంలో ప్రేక్ష‌కుల‌ను అలరించలేకపోయాడు. అర్జునా ఫాల్గుణ‌, భ‌ళా తంద‌నాన చిత్రాలు ఏమాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయాయి. ఇప్పుడు అల్లూరి అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యాడు.

ఈ చిత్రానికి ప్ర‌దీప్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఈ సినిమా టీజ‌ర్‌ను చిత్రం బృందం విడుదల చేసింది. ల‌క్కీ మీడియా బ్యాన‌ర్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీవిష్ణు  పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. 81 సెకన్ల ఈ టీజర్ లో పోలీస్ డ్రెస్ లో శ్రీవిష్ణు ఆకట్టుకున్నాడు. విప్లవానికి నాంది చైతన్యం.. చైతన్యానికి పునాది నిజాయతీ..నిజాయతీకి మారుపేరు అల్లూరి అనే డైలాగ్స్ బాగున్నాయి. ఈ చిత్రానికి నిజాయితీకి మారుపేరు అనే ట్యాగ్ లైన్ ఇచ్చారు. అందుకు తగ్గట్గుగా హీరో పాత్రను మలచినట్టు టీజర్ చూస్తే అర్థం అవుతోంది. మ‌రి. ఈ అల్లూరి సినిమా అయినా శ్రీవిష్ణుకు ఆశించిన విజ‌యాన్ని అందిస్తుందేమో చూడాలి.

Also Read :  శ్రీవిష్ణు ‘అల్లూరి’ ఫస్ట్ లుక్ విడుదల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular