నందమూరి నటసింహం బాలకృష్ణ ఆ మధ్య కథానాయకుడు, మహానాయకుడు అనే సినిమాలు చేయడం.. ఆ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడడం తెలిసిందే. ఫ్లాపుల్లో ఉన్న బాలయ్యకు మళ్లీ ఊపు తీసుకువచ్చిన చిత్రం అఖండ. బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో సింహా, లెజెండ్ చిత్రాలకు మించిన విజయాన్ని అఖండ సాధించింది. బోయపాటికి కూడా వినయ విధేయ రామ సినిమా షాక్ నుంచి ఊరటతో పాటు ఊపు నిచ్చిన సినిమా.
అయితే… అఖండ తర్వాత మళ్లీ ఆ ఇద్దరి కాంబినేషన్ మీద వార్తలు వస్తున్నాయి. రాబోయే ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడేలా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ సినిమాను బోయపాటి తీస్తారని టాక్ వినిపిస్తుంది. దీని బ్యానర్ ఇంకా డిసైడ్ కాలేదు. ప్రస్తుతం బోయపాటి రామ్ తో చేస్తున్న పాన్ ఇండియా వర్క్ లో బిజీగా ఉన్నారు. బాలయ్య కూడా జై బాలయ్య, అలాగే అనిల్ రావిపూడి సినిమాలు పూర్తి చేయాల్సి వుంది.
ఆ తర్వాత బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో మూవీ ఉంటుందట. అయితే.. బాలయ్యతో చేయబోయే పొలిటికల్ టచ్ సినిమాకు సీక్వెల్ టచ్ కూడా ఇస్తే ఎలా వుంటుంది అనే ఆలోచన బోయపాటి చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అఖండ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. అయితే.. అఖండ సీక్వెల్ వేరుగా చేస్తారా? లేక దీనికెే పొలిటికల్ టచ్ ఇస్తారా.? అనేది తెలియాల్సివుంది. బాలయ్య, బోయపాటి కలిసి మరో సినిమా చేస్తే.. సంచలనమే అవుతుంది.