Wednesday, March 18, 2026
Homeసినిమార‌జ‌నీ, క‌మ‌ల్ కాంబోలో భారీ మ‌ల్టీస్టార‌ర్?

ర‌జ‌నీ, క‌మ‌ల్ కాంబోలో భారీ మ‌ల్టీస్టార‌ర్?

సూపర్ స్టార్ రజినీకాంత్, యూనివ‌ర్శిల్ హీరో కమల్ హాసన్ ఇద్ద‌రికీ ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. వీరిద్ద‌రూ  కోలీవుడ్ సూపర్ స్టార్స్ మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది. ఇటీవల రజని పెద్దన్న మూవీతో  సక్సెస్ అందుకోగా, కమల్ లేటెస్ట్ గా ‘విక్రమ్‘ తో బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించారు.

ర‌జ‌నీ, క‌మ‌ల్ క‌లిసి ఓ సినిమా చేస్తార‌ని గ‌త కొన్ని రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతూ వస్తోంది.  కమల్.. రాజ్ కమల్ ఫిలిమ్స్ బ్యానర్ పై లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ ఒక మూవీ చేయాల్సింది. అయితే కొన్ని కారణాల వలన అది సెట్ కాలేదు. తరువాత రజని వరుసగా మూవీస్ చేస్తూ కొనసాగడం, లోకేష్ కూడా విజయ్ తో మాస్టర్, కమల్ తో విక్రమ్ మూవీస్ తీయడం జరిగింది. అయితే.. త్వరలో అటు రజని, ఇటు కమల్ ఇద్దరినీ కలిపి భారీ మూవీ తీసేందుకు దర్శకుడు లోకేష్ ఒక పవర్ ఫుల్ స్టోరీ సిద్ధం చేస్తున్నారని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.

లోకేష్ క‌న‌క‌రాజ్  ఉన్నారు. ఆయ‌న క‌మిట్ అయిన సినిమాలు పూర్తి చేసిన త‌ర్వాత ఈ మూవీ స్టార్ట్ అవుతుంద‌ని స‌మాచారం. మొత్తంగా ఇదే కనుక జరిగితే, వెండితెర పై మ‌రో సంచ‌ల‌నం అవుతుంది. ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ ని చూసే అదృష్టం అభిమానుల‌కు ఆడియన్స్ కి కలుగుతుంది. మ‌రి.. ఈ మూవీ ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular