Saturday, June 13, 2026
HomeTrending Newsఫ్లాయిడ్ హత్య కేసులో సంచలన తీర్పు

ఫ్లాయిడ్ హత్య కేసులో సంచలన తీర్పు

ఆఫ్రో అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. జార్జ్ ఫ్లాయిడ్ మరణానికి కారణమైన డెరిక్ చువిన్ కు ఇరవై రెండున్నర ఏళ్ల శిక్ష విధించింది. ఫ్లాయిడ్ తరపు న్యాయవాది 30 ఏళ్ళు శిక్ష వేయాలని కోరగా జడ్జి అంగీకరించలేదు. కోర్టు హాలులో డెరిక్ మోకాళ్ళపై నిలుచొని తన తప్పు మన్నించాలని వేడుకోవటం అందరిని కలచి వేసింది. డెరిక్ కు గతంలో ఎలాంటి క్రిమినల్ రికార్డు లేకపోవటం గమనార్హం. అధికార దుర్వినియోగం క్షమార్హం కాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

గత ఏడాది మే 25న మినియాపోలీస్ లో ఆఫ్రికా-అమెరికన్ జార్జ్ ప్లాయిడ్ ను నకిలీ నోట్ల కేసులో అరెస్టు చేసే క్రమంలో పోలీసు అధికారి డెరెక్ చౌవిన్ అతని పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. జార్జ్ మెడపై మోకాలు వుంచి నొక్కి పెట్టాడు. 9 నిమిషాల పాటు అలాగే ఉంచడంతో ఊపిరాడక ఫ్లాయిడ్ మరణించాడు.

ఈ మృతిపై యావత్ అమెరికా భగ్గుమంది. జాతి వివక్షతోనే ఫ్లాయిడ్ ను చంపేశారంటూ ఆందోళనకారులు ఆరోపించారు. నాటి డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వాన్ని నిరసనలు కుదిపివేశాయి. ఫ్లాయిడ్ చివరి సారిగా మాట్లాడిన ‘ ఐ కెన్నాట్ బ్రీత్’ అనే పేరుతో మొదలైన ఈ ఉద్యమానికి ప్రపంచంలోని ఎన్నో దేశాలు మద్దతు తెలిపాయి. డెరెక్ ను వెంటనే సస్పెండ్ చేసిన అధికార యంత్రాంగం ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. ఈ సంఘటనను విచారించిన కోర్టు డెరెక్ ను దోషిగా తీర్పు చెప్పింది. నిందితులుగా ఉన్న మరో ముగ్గురు పోలీసు అధికారులపై ఆగస్టులో విచారణ జరగనుంది.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎన్నకల ప్రచార సందర్భంగా పలుసార్లు ఈ ఉదంతాన్ని ప్రస్తావించారు. ఎనికల్లో గెలిచిన బైడెన్ ప్రమాణ స్వీకారానికంటే ముందు ఓ సందర్భంలో ఫ్లాయిడ్ కుమార్తె ముందు మోకరిల్లి తన క్షమాపణలు కోరారు.

ఫ్లాయిడ్ పేరుతో ‘జార్జ్ ఫ్లాయిడ్ జస్టిస్ ఇన్ పోలీసింగ్ యాక్ట్’ పేరుతో ఓ బిల్లును తీసుకురావాలని బైడెన్ నిర్ణయించారు కాని అది పెండింగ్ లో ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular