ప్రభుత్వం తమపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరుతూ విపక్ష పార్టీల ఎంపీలు పార్లమెంటులో రాత్రి పూట ఆందోళనకు ధర్నాకు దిగారు. రాత్రంతా మహాత్మాగాంధీ విగ్రహం ఎదుటే బైఠాయించారు. అక్కడే పడుకుని కేంద్రానికి తమ నిరసన తెలిపారు. రాజ్యసభలో టీఆర్ఎస్ సహా ఇతర విపక్షాలకు చెందిన 20 మంది ఎంపీల సస్పెన్షన్ పై ఆయా పార్టీలు మండిపడ్డాయి. కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా అందరూ కలిసి 48 గంటల నిరవధిక ధర్నాకు పిలుపునిచ్చారు. అందులో భాగంగా రాత్రి జరిగిన ధర్నాలో టీఆర్ఎస్ నుంచి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పాల్గొన్నారు. ఆయన రాత్రంతా గాంధీ విగ్రహం ఎదుటే పడుకుని ప్రభుత్వానికి తన నిరసన తెలిపారు.
Also Read : పార్లమెంటులో వ్యూహానికి తెరాస సమావేశం