Sunday, November 24, 2024
Homeసినిమారెమ్యూన‌రేషన్ త‌గ్గించుకుంటాం - ఎన్టీఆర్, చ‌ర‌ణ్‌, బ‌న్నీ

రెమ్యూన‌రేషన్ త‌గ్గించుకుంటాం – ఎన్టీఆర్, చ‌ర‌ణ్‌, బ‌న్నీ

క‌రోనా వ‌ల‌న ఇండ‌స్ట్రీకి కోలుకోలేని దెబ్బ‌. ఇప్పుడిప్పుడే ఇండ‌స్ట్రీ కోలుకుంటుందనుకుంటే… ఓటీటీ స‌వాల్ గా మారింది. టాక్ డివైడ్ గా వ‌స్తే.. మ్యాట్నీ షోకే జ‌నాలు రాక‌పోవ‌డంతో నిర్మాత‌కు భారీ న‌ష్టాలు వ‌స్తున్నాయి. దీంతో పాటు నిర్మాణ వ్య‌యం బాగా పెరిగిపోవ‌డంతో బ‌డ్జెట్ త‌గ్గించాలి అనుకుంటున్నారు కానీ.. కుద‌ర‌డం లేదు. ఇండ‌స్ట్రీలో ఉన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకోవ‌డం కోసం చ‌ర్చ‌లు జ‌రుగుతూనే ఉన్నాయి.

కొంత మంది నిర్మాత‌లు మందుకు వ‌స్తున్నారు. కొంత మంది నిర్మాత‌లు మీటింగ్ కు కూడా రావ‌డం లేదు. దీంతో ఆగ‌ష్టు 1 నుంచి షూటింగులు ఆపేసి స‌మ‌స్య‌ల ప‌రిష్క‌రం క‌నుక్కున్న త‌ర్వాత మ‌ళ్లీ షూటింగులు స్టార్ట్ చేయాల‌ని ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ నిర్ణ‌యం తీసుకుంది. ఫిలింఛాంబ‌ర్ లో సంప్ర‌దించ‌కుండానే ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం పై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. మ‌రో వైపు నిర్మాత దిల్ రాజు స్టార్ హీరోల‌తో చ‌ర్చ‌లు మొద‌లుపెట్టారు.

హీరోలు రెమ్యూన‌రేష‌న్స్ త‌గ్గించుకోవాల‌ని.. నిర్మాత న‌ష్టాల్లో ఉన్నాడ‌ని ఎన్టీఆర్, చ‌ర‌ణ్‌, బ‌న్నీల‌తో దిల్ రాజు చ‌ర్చ‌లు జ‌రిపారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఎన్టీఆర్, చ‌ర‌ణ్‌, బ‌న్నీ త‌మ రెమ్యూన‌రేష‌న్స్ త‌గ్గించుకుంటామ‌ని చెప్పార‌ని స‌మాచారం. అలాగే మిగిలిన హీరోల‌తో కూడా దిల్ రాజు చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్నార‌ని స‌మాచారం. మ‌రి.. త్వ‌ర‌లోనే ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ల‌భిస్తుందేమో చూడాలి.

Also Read : చేతులు కాలాక 

RELATED ARTICLES

Most Popular

న్యూస్