Friday, June 12, 2026
Homeసినిమాఎన్టీఆర్ మూవీపై క్లారిటీ ఇచ్చిన క‌ళ్యాణ్ రామ్

ఎన్టీఆర్ మూవీపై క్లారిటీ ఇచ్చిన క‌ళ్యాణ్ రామ్

ఆర్ఆర్ఆర్ మూవీలో ఎన్టీఆర్ కొమ‌రం భీమ్ గా న‌ట విశ్వ‌రూపం చూపించ‌డంతో సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా మంచి క్రేజ్ ఏర్ప‌డింది. ఆ క్రేజ్ కి త‌గ్గ‌ట్టుగా భారీ పాన్ ఇండియా మూవీని వెంట‌నే సెట్స్ పైకి తీసుకెళ‌తారని  అనుకున్నారు కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ స్టార్ట్ కాలేదు. ‘ఆచార్య’ కి సంబంధించిన సమస్యల్లో కొరటాల ఉండటం వలన ఈ ప్రాజెక్టు సెట్స్  పైకి వెళ్లడానికి మరింత ఆలస్యమవుతోంది. ప్రస్తుతానికి కొరటాలతో ఈ ప్రాజెక్టు ఉండకపోవచ్చనే టాక్ కూడా వినిపిస్తోంది.

అయితే.. ఎన్టీఆర్, కొరటాల సినిమాకి కళ్యాణ్‌ రామ్ కూడా ఒక నిర్మాత. బింబిసార సినిమా ప్రమోషన్స్ లో ఆయన ఎన్టీఆర్ 30వ సినిమాకి సంబంధించిన విషయాన్ని ప్రస్తావించాడు. “రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ ఏ స్థాయి విజయాన్ని సాధించిందనేది అందరికీ తెలిసిందే. ఆ తరువాత సినిమా విషయంలోనూ  ఆడియన్స్ అంచనాలకి ఎంతమాత్రం తగ్గని విధంగా ఎన్టీఆర్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన కసరత్తే జరుగుతోంది. ఎన్టీఆర్ 30వ సినిమాకి సంబంధించిన అప్ డేట్ రావడం లేదని చాలామంది అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. అభిమానులకి ఆ మాత్రం ఆత్రుత ఉండటం సహజం. తారక్ పైనే కాదు దర్శకుడి పై కూడా ఒత్తిడి ఉంటుంది. అందువలన మరింత జాగ్రత్తగా అడుగులు వేయడం జరుగుతుంది. ఒక అనౌన్స్ మెంట్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచన చేసుకుని చేయాలి. అది అభిమానులకు ఆనందాన్ని కలిగించేది.. వాళ్లు ఆమోదించేది అయ్యుండాలి. అందుకోసమే వెయిట్ చేయడం జరుగుతోంది త‌ప్ప మ‌రొక‌టి కాదు” అని క్లారిటీ ఇచ్చారు క‌ళ్యాణ్ రామ్.

Also Read : ఒకే స్టేజ్ పై సంద‌డి చేయ‌నున్న బాల‌య్య‌, ఎన్టీఆర్?  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular