Wednesday, June 17, 2026
HomeTrending Newsసెప్టెంబర్ లో టిడిపి ఖమ్మం బహిరంగ సభ

సెప్టెంబర్ లో టిడిపి ఖమ్మం బహిరంగ సభ

తెలుగుదేశం అధినేత చంద్రబాబు మళ్ళీ తెలంగాణ రాజకీయాలపై దృష్టి సారించారు. తెలంగాణలోనే తెలుగుదేశం ఆవిర్భావం జరిగిందని, వ్యవస్థాగతంగా తెలంగాణలో టిడిపి బలంగా ఉందని చంద్రబాబు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గం పహాడ్ మండలంలో వరద ముంపు బాధితుల్ని పరామర్శించిన చంద్రబాబు ఆ తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లా, మహబూబాబాద్ తెలుగుదేశం నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు మాట్లాడుతూ…తెలంగాణలో మళ్లీ తెలుగుదేశం బలపడుతుందన్నారు.

తెలుగు జాతి ఉన్నంత వరకూ తెలుగుదేశం పార్టీ ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. యువత భవిష్యత్తు బాగుండాలంటే తెలంగాణలోనూ తెలుగుదేశం ఉండాలన్నారు. ఖమ్మంతో తెలుగుదేశం పార్టీకి విడదీయరాని బంధం ఉందన్న చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి ఖమ్మం జిల్లా కంచుకోట అన్నారు. వచ్చే సెప్టెంబర్ లో ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించి తెలుగుదేశం సత్తా చాటుదామని చంద్రబ్బు పార్టీ నేతలకు పిలుపు ఇచ్చారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular