కామన్ వెల్త్ గేమ్స్ లో బ్యాడ్మింటన్ ఆటగాళ్ళు గ్రూప్ కేటగిరీలో తమ సత్తా చాటుతున్నారు. నిన్న జరిగిన తొలి మ్యాచ్ లో శ్రీలంకను 5-0 తో ఓడించిన ఇండియా ఆ తర్వాత ఆస్ట్రేలియాపై 4-1 తేడాతో గెలుపొంది క్వార్టర్స్ కు చేరుకున్నారు.
మొదటి మ్యాచ్… పురుషుల సింగిల్స్ లో కిడాంబి శ్రీకాంత్ 21-14; 21-13తో యింగ్ జియాంగ్ పై
రెండో మ్యాచ్… మహిళల సింగిల్స్ లో పివి సింధు 21-10; 21-12 తో వెండీ చెన్ పై
మూడో మ్యాచ్…. పురుషుల డబుల్స్ లో చిరాగ్ శెట్టి-బి.సుమీత్ రెడ్డి జోడీ 21-16;21-19తో జాక్ యూ- ట్రాన్ హోయాంగ్ లపై గెలుపొంది ఇండియా ఆధిక్యం 3-0కు తీసుకెళ్ళారు.
ఐతే నాలుగో మ్యాచ్… మహిళల డబుల్స్ లో గాయత్రి గోపీచంద్- త్ర్రెసా జాలీలు 13-21;19-21తేడాతో వెండీ చెన్- గ్రోన్యా సోమర్విల్లె చేతిలో ఓటమి పాలయ్యారు.
ఐదో మ్యాచ్…మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్ లో అశ్విని పొన్నప్ప- సుమీత్ రెడ్డి ద్వయం 21-14;21-11తో యింగ్ జియాంగ్ లిన్- గ్రోన్యా సోమర్విల్లె జంటపై గెలుపొంది 4-1తో ఇండియాకు విజయం అందించారు.