Saturday, June 13, 2026
HomeTrending Newsతప్పు తేలితే కఠిన చర్యలు: సజ్జల

తప్పు తేలితే కఠిన చర్యలు: సజ్జల

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో మార్ఫింగ్ కాదని తేలితే ఆయనపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి వెల్లడించారు.

ఈ వీడియో మార్ఫింగ్ అని గోరంట్ల మాధవ్ చెప్పారని, దీనిపై అయన పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారని, విచారణ జరుగుతుందని, ఒకవేళ మాధవ్ తప్పు చేసినట్లు తేలితే ఆయనపై తప్పకుండా చర్యలుంటాయని సజ్జల స్పష్టం చేశారు. పోలీసు నివేదిక కోసం వేచి చూస్తున్నామని, ఇలాంటి వ్యవహారాలపై  ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని, తమ చర్యలు కూడా చేతల్లో ఉంటాయని చెప్పారు. ఇలాంటి వ్యవహారాలను సహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మహిళా పక్షపాత  ప్రభుత్వంగా ఉన్న తమ పార్టీ ఎలా వ్యవహరించాలో అంటే స్థాయిలో తమ నిర్ణయం కూడా ఉంటుందన్నారు.

Also Read : పరువు నష్టం దావా వేస్తా: విజయ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular