Saturday, June 13, 2026
Homeస్పోర్ట్స్CWC-2022: Table Tennis(Para): సెమీస్ కు భవీనా, సోనాల్ బెన్, రాజ్ అలగర్

CWC-2022: Table Tennis(Para): సెమీస్ కు భవీనా, సోనాల్ బెన్, రాజ్ అలగర్

టోక్యోలో జరిగిన  పారా ఒలింపిక్స్ సి 4 విభాగంలో  రజత పతకం సాధించి సత్తా చాటిన భవీనా పటేల్ కామన్ వెల్త్ గేమ్స్  సెమీఫైనల్స్ కు చేరుకుంది. ఆమెతో పాటు సోనాల్ బెన్ పటేల్ కూడా మహిళల పారా సింగిల్స్ సి3-5 విభాగంలో సెమీస్ కు చేరుకున్నారు.

భవీనా పటేల్ ఫిజీ క్రీడాకారిణి లాటు పై… సోనాల్ బెన్ నైజీరియా క్రీడాకారిణి ఒబియోరా పై గెలుపొందారు.

సెమీస్ లో భవీనా  ఇంగ్లాండ్ కు  చెందిన బైలీ, సోనాల్ నైజీరియా క్రీడాకారిణి ఇక్ ప్యూయి తో తలపడనున్నారు.

Bhavina Sonal Ben

మరోవైపు పురుషుల సింగిల్స్ సి3-5 విభాగంలో భారత ఆటగాడు రాజ్ అలగర్ కూడా సెమీ ఫైనల్లోకి చేరుకున్నాడు. నేడు జరిగిన క్వార్టర్ ఫైనల్స్ లో ఇంగ్లాండ్ కు చెందిన బుల్లెన్ పై 3-1తో విజయం సాధించాడు. రేపు జరగబోయే సెమిఫైనల్ మ్యాచ్ లో నైజీరియా కు చెందిన సూలె తో తలపడనున్నాడు.

Also Read :  జూడోలో తూలికకు రజతం 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular