Saturday, April 20, 2024
Homeస్పోర్ట్స్CWG-2022: India: జూడోలో తూలికకు రజతం

CWG-2022: India: జూడోలో తూలికకు రజతం

బర్మింగ్ హామ్ లో జరుగుతోన్న కామన్ వెల్త్ క్రీడల్లో ఇండియా నేడు ఒక రజతం, నాలుగు కాంస్య పతకాలు దక్కాయి. జూడోలో మహిళల 78కిలోల విభాగంలో తూలిక మాన్  రజత పతకం సంపాదించింది. 1ఎస్ 2-10 తేడాతో స్కాట్లాండ్ క్రీడాకారిణి చేతిలో ఓటమి పాలై రెండో స్థానంలో నిలిచింది.

ఆగస్ట్ 3న తొలి పతకం …. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో లవ్ ప్రీత్ సింగ్ 109కిలోల విభాగంలో కాంస్యం సంపాదించాడు. ఆ తర్వాత స్క్వాష్ లో ఇండియా ఆటగాడు సౌరవ్ ఘోషల్ కాంస్యం గెలిచాడు. మూడో స్థానం కోసం జరిగిన పోటీలో 11-6;11-1;11-4 తేడాతో డిపెండింగ్ ఛాంపియన్ ను ఓడించి పతకం ఖాయం చేసుకున్నాడు. నేటి మూడో పతకం తూలిక మాన్  ది.

ఆ తర్వాత 109ప్లస్ కిలోల కేటగిరీలో గుర్ దీప్ సింగ్ మూడో స్థానంలో నిలిచి కాంస్యం గెల్చుకున్నాడు. స్నాచ్ లో 167; క్లీన్ అండ్ జర్క్ లో 223కిలోలు కలిపి మొత్తం 390 కేజీల బరువు ఎత్తి పతకం గెల్చుకున్నాడు. పాకిస్తాన్ కు చెందిన దస్తగిర్ బట్ 405 (173+232) కిలోల బరువు ఎత్తి స్వర్ణం గెల్చుకున్నాడు.

మన దేశానికి చెందిన హై జంప్ క్రీడాకారుడు తేజస్విన్ శంకర్ తొలిసారి ఈ విభాగంలో ఇండియాకు పతకం అందించాడు. 2.25మీటర్ల ఎత్తును అందుకోలేకపోయిన శంకర్ నాలుగు ప్రయత్నాల్లో 2.10; 2.15;2.19;2.22 ఎత్తు అధిగమించాడు.

ఆగస్ట్ 3న లభించిన ఒక రజతం, ఐదు కాంస్య పతకాలతో మనదేశం మొత్తం 18 మెడల్స్ సాధించింది. వీటిలో ఐదు స్వర్ణాలు, ఆరు రజతం, ఏడు  కాంస్య పతకాలు ఉన్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్