Monday, June 8, 2026
HomeTrending Newsయాదాద్రిలో మంత్రి  రోజా వరలక్షీ వ్రతం

యాదాద్రిలో మంత్రి  రోజా వరలక్షీ వ్రతం

Varalakshi Vratam:  ఆంధ్ర ప్రదేశ్ సాంస్కృతిక, పర్యాటక, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా తెలంగాణలోని యాదాద్రి  శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. నేడు శ్రావణ శుక్రవారం సందర్భంగా యాదగిరి గుట్ట స్వామి సన్నిధిలో వరలక్ష్మీ వ్రతం చేసుకున్నారు. అనంతరం ఆలయ పండితులు ఆమెకు సంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికి వేద ఆశీర్వచనం అందించారు.

తెలుగు రాష్ట్రాలలోని మహిళలకు శ్రావణ శుక్రవారం సందర్భంగా మంత్రి రోజా శుభాకాంక్షలు తెలియజేశారు. సిరి సంపదల కోసం, కుటుంబ శ్రేయస్సు కోరుతూ ప్రతియేటా మహిళలు శ్రావణమాసం రెండో శుక్రవారం రోజున వరలక్షి వ్రతం ఆచరిస్తారని ఆమె పేర్కొంటూ.. తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్ధించినట్లు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular