స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తోన్న భారీ చిత్రం ‘పుష్ప’. ఆర్య, ఆర్య 2 తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై అటు అబిమానుల్లోను, ఇటు ఇండస్ట్రీలోను అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. దీనికి తోడు పుష్ప టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడం… ఇది అల్లు అర్జున్ కు మొదటి పాన్ ఇండియా మూవీ కావడంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదలవుతుందా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. గోవాలో తదుపరి షెడ్యూల్ ను ప్లాన్ చేశారని తెలిసింది. 15 రోజుల పాటు గోవాలో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణపరంగా ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీతో ఈ సినిమాని నిర్మిస్తుంది.
రెండు పార్ట్ లుగా వస్తోన్న ఈ సినిమా మొదటి భాగాన్ని ఈ ఏడాది చివర్లో విడుదల చేయనున్నారని సమాచారం. అల.. వైకుంఠపురములో హిట్ తర్వాత అల్లు అర్జున్, ‘రంగస్థలం’ భారీ విజయం తర్వాత సుకుమార్ కు పుష్ప ప్రాజెక్టు కీలకం కాబోతోంది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.