Saturday, April 20, 2024
HomeTrending Newsఅఖిలపక్షం పిలవండి: సోము డిమాండ్

అఖిలపక్షం పిలవండి: సోము డిమాండ్

కృష్ణాజలాల వివాదంపై ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. మన నీటిపారుదల ప్రాజెక్టులు, హక్కుల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయంతో గట్టిగా నిలబడాలని సూచించారు. లేకపోతే నీటి పంపిణీ విషయంలో రాష్ట్రం నష్టపోయే ప్రమాదం ఉందని అయన ఆందోళన వ్యక్తం చేశారు.

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు విజయవాడలో జరుగుతున్నాయి. బిజెపి రాష్ట్ర సహా ఇన్ ఛార్జ్ సునీల్ దియోధర్, కన్నా లక్ష్మీ నారాయణ, ఎమ్మెల్సీలు మాధవ్, వాకాటి నారాయణ రెడ్డి తదితరులు హాజరయ్యారు. నీటిపారుదల ప్రాజెక్టుల వివాదం, కొత్త ఇసుక పాలసీ, ఉద్యోగ క్యాలండర్ పై చర్చిస్తున్నారు.

మద్యం పాలసీ ద్వారా ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపించిన సోము, ఎక్సైజ్ ఆదాయంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. ఆర్టీఐ ద్వారా సమాచారం తెప్పించగా రూ.25 ఉన్న చీప్ లిక్కర్ బాటిల్ ను రాష్ట్రంలో 300 రూపాయలకు అమ్ముతున్నట్లు తెలిసిందన్నారు. మద్య నియంత్రణకు కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం చెబుతున్నా షుమారు 18 వేల కోట్ల రూపాయల ఆదాయం ఎలా వస్తుందని సోము ప్రశ్నించారు.

ప్రభుత్వానికి ప్రచార ఆర్భాటం ఎక్కువైందని, అవాస్తవాలను ప్రచారం చేసుకుంటున్నారని సోము విమర్శించారు. రాష్ట్రంలో రెండు లక్షల యాభై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేవలం 10 వేల భర్తీకే జాబ్ క్యాలండర్ విడుదల చేశారని అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, యువమోర్చా దీనిపై ఉద్యమాలు చేస్తోందని వీర్రాజు వెల్లడించారు. ఉద్యోగాల భర్తీపై సిఎం జగన్ గతంలో చెప్పిన మాటకు, ఇప్పుడు చేస్తున్న దానికి పొంతన లేకుండా పోయిందన్నారు. వెంటనే ఇటీవల ప్రకటించిన జాబ్ క్యాలండర్ ను వెంటనే వెనక్కు తీసుకుని కొత్త క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లర్ల మాఫియాను ప్రభుత్వం అదుపు చేయలేకపోతోందని, ధాన్యానికి లేని ధర బియ్యానికి ఎలా వస్తుందని సోము ప్రభుత్వాన్ని నిలదీశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్