Friday, March 29, 2024
HomeTrending Newsపీవీని ఎంత స్మ‌రించుకున్నా త‌క్కువే : సీఎం కేసీఆర్

పీవీని ఎంత స్మ‌రించుకున్నా త‌క్కువే : సీఎం కేసీఆర్

మాజీ ప్ర‌ధాని, తెలంగాణ ముద్దుబిడ్డ‌ పీవీ న‌రసింహారావును ఎంత స్మ‌రించుకున్నా తక్కువేనని ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. పీవీ ఒక కీర్తి శిఖ‌రం. ప‌రిపూర్ణ‌మైన సంస్క‌ర‌ణ శీలి అని కేసీఆర్ అన్నారు. పీవీ మార్గ్ లోని జ్ఞాన‌భూమిలో ఏర్పాటు చేసిన పీవీ శ‌త జ‌యంతి ముగింపు ఉత్స‌వాల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.

బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి, బహుభాషా కోవిదులు పీవీ న‌ర‌సింహారావు శ‌త జ‌యంతి ఉత్స‌వాలు నేటితో సుసంప‌న్న‌మ‌వుతున్నాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి అతలాకుత‌లం చేస్తున్న‌ప్ప‌టికీ, గ‌తేడాది కాలంలో కేకే ఆధ్వ‌ర్యంలో పీవీ శ‌త జ‌యంతి ఉత్స‌వాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. విదేశాల్లో పీవీ శ‌త జ‌యంతి ఉత్స‌వాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించిన మ‌హేశ్ బిగాల‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు సీఎం కేసీఆర్.

విద్యా సంస్క‌ర‌ణ‌ల్లో భాగంగా గురుకుల‌, న‌వోద‌య పాఠ‌శాల‌ల‌ను పీవీ న‌ర‌సింహారావు తీసుకొచ్చారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. పీవీ ప్రారంభించిన గురుకుల పాఠ‌శాల‌లోనే చ‌దివి డీజీపీని కాగ‌లిగాన‌ని మ‌హేంద‌ర్ రెడ్డి స్మ‌రిస్తూంటారని, ఇలా ఎంతో మంది పీవీని స్మ‌రించుకుంటార‌ని సీఎం పేర్కొన్నారు.

పీవీ తీసుకొచ్చిన అనేక సంస్క‌ర‌ణలు మ‌న క‌ళ్ల ముందు ఉన్నాయని కేసీఆర్ తెలిపారు. పీవీ చేప‌ట్టిన భూ సంస్క‌ర‌ణ‌లు భార‌త‌దేశంలో ఇత‌ర రాష్ట్రాలు మార్గ‌ద‌ర్శ‌కంగా తీసుకున్నాయి. పీవీ 800 ఎక‌రాల విలువైన సొంత భూమిని ప్ర‌జ‌ల‌కు ధార‌దాత్తం చేశారు. ఆ విధంగా త‌న నిబ‌ద్ధ‌త‌ను చాటుకుంటూ భూ సంస్క‌ర‌ణ‌ల‌ను అమ‌లు చేశారు.

కాక‌తీయ వ‌ర్సిటీలో పీవీ విద్యా పీఠం

కాక‌తీయ వ‌ర్సిటీలో పీవీ పీఠాన్ని ఏర్పాటు చేస్తున్నామ‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. వ‌ర్సిటీ వీసీ తాటికొండ ర‌మేశ్ పంపిన ప్ర‌తిపాద‌న‌ల‌ను ప్ర‌భుత్వం ఆమోదిస్తున్న‌ద‌ని పేర్కొన్నారు. దేశం ఆర్థికంగా దివాలా తీసిన ప‌రిస్థితుల్లో.. పీవీ ఆర్థిక సంస్క‌ర‌ణ‌లు తీసుకొచ్చారు. నాటి ఆర్థిక సంస్క‌ర‌ణ వ‌ల్లే నేడు పెట్టుబడులు వ‌స్తున్నాయన్నారు. పీవీ ప్ర‌ధానిగా ఉన్న స‌మ‌యంలో తాను ఆర్థిక మంత్రిగా ఉండ‌టం గ‌ర్వంగా ఫీల‌వుతాన‌ని మ‌న్మోహ‌న్ సింగ్ అనేవార‌ని సీఎం గుర్తు చేశారు.

పీవీ మ‌న తెలంగాణ ఠీవీ అని గతేడాదే తాను చెప్పాన‌ని సీఎం కేసీఆర్ అన్నారు. ఆ విధంగా పీవీ ర‌చ‌న‌లు, రాజ‌కీయ వ్యాసాల‌ను వెలుగులోకి తీసుకొచ్చేందుకు న‌మ‌స్తే తెల‌గాణ దిన‌ప‌త్రిక విశేష‌మైన కృషి చేసిందన్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ కు పీవీ మార్గ్ అని నామ‌క‌ర‌ణం చేయ‌డం సంతోషంగా ఉందని సిఎం తెలిపారు. భ‌విష్య‌త్‌లో అనేక ప‌థ‌కాల‌కు పీవీ పేరు పెట్టుకుంటామ‌ని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్