కామన్ వెల్త్ గేమ్స్ లో ఇండియాకు నిన్న పదోరోజు పతకాల పంట పండింది. మొన్న శనివారం 14 పతకాలు రాగా, నిన్న ఆదివారం వివిధ క్రీడాంశాల్లో 15 పతకాలు లభించాయి. వీటిలో ఐదు స్వర్ణం, నాలుగు రజతం, ఆరు కాంస్యం ఉన్నాయి. నీతూ గాంఘస్ తో మొదలైన పసిడి పతకాల వేట టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో శరత్ ఆచంట, శ్రీజ ఆకుల తో నిన్నటి ఆటలు ముగిశాయి. శరత్- శ్రీజ జంట ఫైనల్లో మలేషియా జోడీ చూంగ్- లైన్ పై 3-1తో విజయం సాధించారు.
మరో వైపు బాక్సింగ్ లో పురుషుల 92కిలోల విభాగంలో సాగర్ ఆహ్లావాట్ రజత పతకం గెల్చుకున్నాడు. ఫైనల్లో ఇంగ్లాండ్ బాక్సర్ ఓరిన్ చేతిలో 5-0తో ఓటమి పాలయ్యాడు.
స్వాష్ మిక్స్డ్ డబుల్స్ లో సౌరవ్ గోషల్- దీపిక పల్లికల్ జోడీ కాంస్యం గెల్చుకుంది. ఆస్ట్రేలియా జోడీపై 2-0తో విజయం సాధించి పతకం సొంతం చేసుకున్నారు.
ఇప్పటి వరకూ ఇండియా మొత్తం 55 మెడల్స్ గెల్చుకోగా వీటిలో 18 స్వర్ణం, 15 రజతం, 22 కాంస్యం ఉన్నాయి. పట్టికలో ఇండియా ప్రస్తుతానికి ఐదో స్థానంలో ఉంది. మరో బంగారు పతకం గెలిస్తే న్యూ జిలాండ్ ను దాటి నాలుగో స్థానికి చేరుతుంది.
Also Read : టేబుల్ టెన్నిస్ లో రజతం, అథ్లెటిక్స్ లో రెండు కాంస్యాలు