భారత టేబుల్ టెన్నిస్ ప్లేయర్ శరత్ కమల్ ఆచంట చరిత్ర సృష్టించాడు. గత కామన్ వెల్త్ గేమ్స్ లో కాంస్య పతకం గెల్చుకున్న నేడు స్వర్ణం గెల్చుకున్నాడు. నేడు జరిగిన ఫైనల్లో ఇంగ్లాండ్ ఆటగాడు లియామ్ పిచ్ ఫోర్డ్ పై 4-1 (11-8, 8-11, 3-11, 11-7, 4-11 ) తేడాతో విజయం సాధించి విజేతగా నిలిచాడు.
కామన్ వెల్త్ గేమ్స్ లో మెన్స్ టీమ్, మెన్స్ డబుల్స్, మెన్స్ సింగిల్స్ లో ఇది శరత్ కు 13వ పతకం కావడం గమనార్హం. వీటిలో ఏడు స్వర్ణాలు, మూడు రజతాలు, మూడు కాంస్య పతకాలు ఉన్నాయి.
ఈ బర్మింగ్ హామ్ పోటీల్లో మెన్స్ టీమ్, మిక్స్డ్ డబుల్స్ లో, మెన్స్ సింగిల్స్ లో మూడు స్వర్ణాలు కమల్ దక్కించుకోవడం విశేషం.
మరోవైపు పురుషుల సింగిల్స్ లో ఇండియా ఆటగాడు సాథియాన్ జ్ఞాన శేఖరన్ 4-3 (11-9, 11-3, 11-5, 8-11, 9-11, 10-12, 11-9) తేడాతో ఇంగ్లాండ్ ఆటగాడు పాల్ డ్రింక్ హాల్ పై విజయం సాధించి కాంస్యం గెల్చుకున్నాడు.