Saturday, November 23, 2024
HomeTrending News8 జిల్లాల్లో ఆంక్షలు సడలింపు

8 జిల్లాల్లో ఆంక్షలు సడలింపు

రాష్ట్రంలో కోవిడ్‌ పాజిటివిటీ రేటు 5శాతం కన్నా తక్కువ ఉన్న 8 జిల్లాల్లో కర్ఫ్యూ నిబంధనలు సడలిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటలవరకూ కర్ఫ్యూ కు సడలింపు ఉంటుంది. రాత్రి 9 నుంచి 10 గంటల మధ్యలో దుకాణాలు, రెస్టారెంట్లు మూసివేయాల్సి ఉంటుంది. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ కఠినంగా అమలు చేస్తారు.

కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న ఉభయగోదావరి, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం…. ఈ ఐదు జిల్లాల్లో గతంలో ఇచ్చిన ఇచ్చినట్లుగా సాయంత్రం 6 గంటలవరకే సడలింపు అమల్లో ఉంటుంది. ఈ జిల్లాల్లో సాయంత్రం 6 నుంచి ఉదయం 6వరకూ కర్ఫ్యూ విధిస్తారు.

జులై 1 నుంచి జులై 7 వరకూ తాజా నిర్ణయం అమల్లో ఉంటుందని, ఆ తర్వాత మరోసారి పాజిటివిటీ రేటు, పరిస్థితిపై సమీక్షించాక ఈ జిల్లాల్లో కూడా సడలింపుపై ఒక నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్