మజిలీ, వెంకీమామ, లవ్ స్టోరీ, బంగార్రాజు… ఇలా వరుసగా విజయాలు సాధించిన నాగచైతన్యకు థ్యాంక్యూ మూవీ చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఇప్పుడు లాల్ సింగ్ చడ్డా అనే బాలీవుడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది నాగచైతన్య నటించిన ఫస్ట్ బాలీవుడ్ మూవీ. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్, కరీనా కపూర్ జంటగా నటించారు. అద్వైత్ చందన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ మూవీని నార్త్ లో నాగచైతన్య బాగా ప్రమోట్ చేశారు.
ఈ మూవీలో చేసిన బోడి బాలరాజు పాత్ర ఎప్పటికీ మర్చిపోలేనని, నిజంగా లాల్ సింగ్ చడ్డా మూవీ తన కెరీర్ లో ఓ తీపి జ్ఞాపకం అన్నారు టాలీవుడ్ హీరో నాగచైతన్య. అమీర్ ఖాన్ గారితో నటించడం వలన చాలా విషయాలు నేర్చుకున్నానని, ఆయన సినిమా విషయంలో చాలా క్లారిటీతో ఉంటారని, ఏ విషయంలోనూ రాజీపడరని చెబుతూ…. సినిమాని ఇంతలా ప్రేమిస్తారా అనిపించిందని చైతూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
ఇక అసలు విషయానికి వస్తే.. చేతి మణికట్టు పై ఉన్న టాటూ ఏంటని ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు గాను, అది తన పెళ్లి జరిగిన తేదీ తాలూకు పచ్చ బొట్ట అని చెప్పారు. అయితే.. అది ఏంటో తెలియక కొందరు తన ఫ్యాన్స్ దానిని కాపీ కొట్టి చేతి పై వేయించుకోవడం చూశానన్నారు. అందుకే ఫ్యాన్స్ అందరికీ చేస్తున్న విన్నపం ఏమిటంటే.. అది నా పెళ్లి తేదీ టాటూ, దయచేసి ఎవరూ దానిని ఫాలో కావొద్దు. టాటూ వేయించుకోవద్దని కోరారు.