Sunday, June 14, 2026
Homeసినిమా'బింబిసార‌'కు బాల‌య్య‌ ప్రశంసలు

‘బింబిసార‌’కు బాల‌య్య‌ ప్రశంసలు

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ న‌టించిన లేటెస్ట్ మూవీ ‘బింబిసార‌’. ఈ మూవీ ద్వారా వ‌శిష్ట్ డైరెక్ట‌ర్ గా ప‌రిచయం అయ్యారు. తొలి సినిమాతోనే వ‌శిష్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేశాడు. క‌ళ్యాణ్ రామ్ కెరీర్ లోనే హ‌య్య‌స్ట్ క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేసిన మూవీగా బింబిసార నిలిచింది. బింబిసార సీక్వెల్ గా పార్ట్ 2 కూడా ప్లాన్ చేస్తున్నారు. మొదటివారం పూర్తి చేసుకున్న ఈ మూవీ సక్సెస్ ఫుల్ గా రెండో వారంలోకి అడుగుపెట్టింది. సెకండ్ వీకెండ్ కూడా కలెక్షన్లు బాగున్నాయి.

తాజాగా నందమూరి బాలకృష్ణ ఈ సినిమాని వీక్షించారు. ప్రసాద్ ల్యాబ్ లో బాలయ్య, ఆయన కుటుంబ సభ్యులు ఈ సినిమాని చూశారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా బాలయ్యతో సినిమా చూశార‌ట‌. సినిమా బాగా నచ్చింది అని బాలయ్య.. నిర్మాత, హీరో కళ్యాణ్ రామ్ ని మెచ్చుకున్నారు. బింబిసార పాత్రలో బాగా నటించావు అని కళ్యాణ్ రామ్ కి బాలయ్య కాంప్లిమెంట్ ఇచ్చారట. అలాగే దర్శకుడు వశిష్టని కూడా బాలయ్య అభినందించారు. మరో వైపు ఈ సినిమా సక్సెస్ సంబరాలని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular