మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ మూవీని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. శంకర్ చేస్తున్న ఫస్ట్ తెలుగు మూవీ కావడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ నటిస్తుంది. శ్రీకాంత్, సునీల్, అంజలి, ఎస్.జె.సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ కి బ్రేక్ పడింది. అయితే.. షూటింగులు ఆపేయడం వలన కాదట. కమల్ హాసన్ ‘విక్రమ్ ‘ వలన అని సమాచారం. కమల్ విక్రమ్ మూవీకి, ఈ సినిమా ఆగిపోవడానికి లింకు ఏంటంటే.. విక్రమ్ మూవీతో కమల్ క్రేజ్ మరోసారి ప్రూవ్ అయ్యింది. దీంతో ఎప్పటి నుంచో పెండింగ్ లో వున్న, కోర్టు మెట్లు ఎక్కి వచ్చిన ‘ఇండియన్ 2’ సినిమాకు కదలిక వచ్చింది.
ఈ సినిమాను శంకర్ చేయాల్సి వుంది. ఆ సినిమా మీద తమిళనాట పెద్దవాళ్ల దృష్టి కూడా పడింది. దాంతో ఇప్పుడు ఆ సినిమా అర్జంట్ గా చేయాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. శంకర్ ‘ఇండియన్ 2’ చేస్తుండడంతో చరణ్ కూడా గౌతమ్ తిన్ననూరితో చేయాల్సిన సినిమాని స్టార్ట్ చేయనున్నారని సమాచారం. ఈ మూవీని ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్నారు. చరణ్, శంకర్ మూవీ తిరిగి ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో క్లారిటీ రావాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.
Also Read : చరణ్ తో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న శంకర్?