Friday, June 12, 2026
Homeస్పోర్ట్స్అమృతోత్సవ వేడుకల్లో టీమిండియా

అమృతోత్సవ వేడుకల్లో టీమిండియా

మూడు వన్డేల సిరీస్ కోసం జింబాబ్వే లో పర్యటిస్తోన్న టీమిండియా నేడు 75వ భారత స్వాతంత్ర్య దినోత్సవాలను ఘనంగా జరుపుకుంది. కెఎల్ రాహుల్ నేతృత్వంలోని 16 మందితో కూడిన జట్టు హరారే లో ఈనెల 18 న జరగబోయే వన్డే మ్యాచ్ కోసం సన్నద్ధమవుతోంది.

నేడు జాతి యావత్తూ స్వాతంత్ర్య అమృతోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు.  ఈ నేపథ్యంలోనే జింబాబ్వే పర్యటనలో ఉన్న జట్టు  తాము బస చేస్తున్న హోటల్ వద్ద స్వాతంత్ర్య వేడుకలు జరిపారు. ఈ వేడుకలో జట్టు సభ్యులతో పాటు తాత్కాలిక కోఅచ్ వివిఎస్ లక్ష్మణ్, సహాయక సిబ్బంది అందరూ పాల్గొన్నారు. ఈ ఫోటోను బిసిసిఐ తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular