Friday, October 18, 2024
Homeసినిమాప్ర‌భాస్ ‘సలార్’ రిలీజ్ డేట్ ఫిక్స్

ప్ర‌భాస్ ‘సలార్’ రిలీజ్ డేట్ ఫిక్స్

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ మూవీ సలార్. ఫ్యాన్స్, ప్రేక్ష‌కులు, యావ‌త్ సినీ ప‌రిశ్ర‌మ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తోన్న చిత్ర‌మిది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్ పై విజ‌య్ కిర‌గందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హై ఎక్స్‌పెక్టేష‌న్స్ క్రియేట్ చేసిన ఈ సినిమా సెప్టెంబ‌ర్ 28, 2023న రిలీజ్ అవుతోంది. అనౌన్స్‌మెంట్ రోజు నుంచే భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేస్తూ ఈ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది. అందులో ప్ర‌భాస్ ఫ‌స్ట్ లుక్ ట్రెమెండెస్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఎప్పుడెప్పుడు ప్ర‌భాస్‌ను వెండితెర పై చూస్తామా అని అంద‌రూ ఎదురు చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇండిపెండెన్స్ డే సంద‌ర్భంగా ప్ర‌భాస్ పాత్ర‌కు సంబంధించిన సరికొత్త లుక్‌ను విడుద‌ల చేయ‌టంతో పాటు రిలీజ్ డేట్ సెప్టెంబ‌ర్ 28, 2023గా అనౌన్స్ చేశారు.

పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న ఇద్ద‌రు స్టార్స్ ఒక‌రేమో ప్ర‌భాస్‌.. మ‌రొక‌రు డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న సినిమా కావ‌టంతో ఎంటైర్ ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీ మూవీ గురించి చాలా ఆతృత‌గా ఎదురుచూస్తోంది. కె.జి.య‌ఫ్ వంటి సెన్సేష‌నల్ బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ మోస్ట్ వాంటెడ్ డైరెక్ట‌ర్‌గా మారారు. అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తోన్న స‌లార్ సినిమాలో ప్ర‌భాస్ ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌న‌టువంటి మాస్ అండ్ రా క్యారెక్ట‌ర్‌తో మెప్పించ‌బోతున్నారు. ఆయ‌న‌ స‌ర‌స‌న శ్రుతీ హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

పాన్ ఇండియా లెవ‌ల్లో తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మల‌యాళ భాష‌ల్లో స‌లార్ మూవీ రిలీజ్ అవుతుంది. ఇంకా ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్‌, జ‌గ‌ప‌తి బాబు, ఈశ్వ‌రీ రెడ్డి, శ్రియా రెడ్డి తదిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను మించేలా అంద‌రినీ ఆక‌ట్టుకునేలా స‌లార్ చిత్రాన్ని రూ. 400 కోట్ల బ‌డ్జెట్‌తో హోంబ‌లే ఫిలింస్ నిర్మిస్తోంది. ఈ డైన‌మిక్ కాంబినేష‌న్‌ను చూస్తుంటే ‘ఎరా ఆఫ్ సలార్ బిగెన్స్’ అని కచ్చితంగా చెప్పొచ్చు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్