Thursday, June 11, 2026
Homeసినిమాలైగర్ మనది... దేశానికి చూపిస్తున్నాం : విజయ్ దేవరకొండ

లైగర్ మనది… దేశానికి చూపిస్తున్నాం : విజయ్ దేవరకొండ

పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ, పాత్ బ్రేకింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ”లైగర్”(సాలా క్రాస్‌బ్రీడ్) ఆగస్ట్ 25న విడుదలవుతోంది. ది గ్రేట్ మైక్ టైసన్ ‘లైగర్’ తో ఇండియన్ సినిమాలో అరంగేట్రం చేస్తున్నారు. పూరి కనెక్ట్స్, బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా…. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.

ఇప్పటికే విడుదలైన లైగర్ ట్రైలర్, పాటలు ఈ చిత్రం పై దేశవ్యాప్తంగా అంచనాలను పెంచాయి. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో ఆగస్ట్ 25న లైగర్ ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో హైదరాబాద్ లో ‘లైగర్‌’ ప్రెస్ మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్. విజయ్ దేవరకొండ, కథానాయిక అనన్య పాండే ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

విజయ్ దేవరకొండ మాట్లాడుతూ “యాక్టర్ అవ్వాలనుకున్నపుడు పెద్ద కలలు ఉండేవి. ‘పెళ్లి చూపులు’తో ప్రయాణం చిన్నగా మొదలైయింది. అయితే ఆ చిత్రానికి ప్రేక్షకులు చాలా పెద్ద విజయాన్ని ఇచ్చారు. అప్పటి నుండి ప్రేమ పంచుతూనే వున్నారు. హైదరాబాద్ నుండి వెళ్లి ఇండియా మొత్తానికి ఒక కథ చెప్పాలని కలగన్నాం. అది ‘లైగర్’ తో చేస్తున్నాం. ఇండియాలో ఎక్కడికి వెళ్ళిన పెద్ద ఎత్తున ప్రేమ లభించింది. కానీ ఎప్పుడూ మర్చిపోలేని ప్రేమ ఇక్కడి నుండే మొదలైయింది. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సమయంలో ఇక్కడ కాలేజీల్లో తిరుగుతుంటే మన పిల్లలు ఇచ్చిన ప్రేమ మర్చిపోలేను. ఇదంతా మన థియేటర్లలోనే మొదలైయింది. లైగర్ పై మేము చాలా కాన్ఫిడెంట్ గా వున్నాం. ఇండియా షేక్ అవుతుంది. ఆగస్ట్ 25 మీ అందరికీ నచ్చే సినిమా, మీరంతా పూర్తిగా ఎంజాయ్ చేసే సినిమా ఇస్తాం” అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular