మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఎవరితో చేయాలనేది అప్పట్లో పెద్ద చర్చ. చాలా మంది దర్శకుల పేర్లు తెర పైకి వచ్చాయి. ఫైనల్ గా వినాయక్ తో ఖైదీ నెంబర్ 150 సెట్ అయ్యింది. అయితే.. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ‘ఆటో జానీ’ చేయాల్సింది కానీ.. లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ అయ్యింది. ముఖ్యంగా చిరంజీవికి సెకండాఫ్ నచ్చకపోవడంతో మార్పులు చెప్పడం.. పూరి మార్పులు చేసినా నచ్చకపోవడంతో ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది.
ఖైదీ నెంబర్ 150 తర్వాత చిరు – సురేందర్ రెడ్డితో సైరా నరసింహారెడ్డి చేశారు. అయితే.. అదే సమయంలో ఎప్పటికైనా చిరుతో సినిమా చేస్తానని పూరీ స్పష్టంగా చెప్పారు. 150 కాకపోతే..151.. అదీ కుదరకపోతే 153 అన్నారు. ఇలా ఎప్పటికైనా చిరంజీవితో సినిమా చేయాలన్న కోరికను ఏదో ఒక రోజు నెరవేర్చుకుంటానని ధీమాగా చెప్పారు. ఈ క్రమంలోనే చిరు మరోసారి ఆటోజానీ కి రిపేర్లు పూర్తి చేసి మళ్లీ ఫ్రెష్ గా కథ వినిపించినట్లు టాక్ వినిపిస్తోంది.
లైగర్ ప్రమోషన్స్ లో ఉన్న పూరి – చిరుతో ప్రాజెక్ట్ ని సెట్ చేసుకునే పనిలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్త మెగా అభిమానుల్లో ఆటోజానీకి ఆశలు చిగురించేలా చేసాయి. ప్రస్తుతం ఆటోజానీ మ్యాటర్ ఇండస్ర్టీ సహా అభిమానుల్లో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. మెగా అభిమానులు కూడా ఈ క్రేజీ మూవీ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి.. ఈసారైనా ఈ ప్రాజెక్ట్ సెట్ అవుతుందేమో చూడాలి.