Thursday, June 11, 2026
Homeసినిమా100 రోజులు పూర్తి చేసుకున్న‌ 'స‌ర్కారు వారి పాట‌'

100 రోజులు పూర్తి చేసుకున్న‌ ‘స‌ర్కారు వారి పాట‌’

సూప‌ర్ స్టార్ మహేష్‌ బాబు హీరోగా, ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘స‌ర్కారు వారి పాట‌‘.  మ‌హేష్ స‌ర‌స‌న మ‌ల‌యాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ న‌టించింది. మైత్రీ మూవీ మేక‌ర్స్, 14 రీల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుని బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ సాధించింది. మే 12న రిలీజైన ఈ సినిమా స‌క్సెస్ ఫుల్ గా 100 రోజులు పూర్తి చేసుకుంది.

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోను .. విశాఖ జిల్లా గోపాలపట్నంలోను రోజుకి 4 ఆటలతో ప్రదర్శితమవుతూ ఈ సినిమా 100 రోజులను పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ స్పెషల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. కొన్ని ఏరియాల్లో స్పెష‌ల్ షోస్ కూడా వేయ‌డం జరిగింది. ఫ‌స్ట్ వీక్, సెకండ్ వీక్.. మ‌హా అయితే.. థ‌ర్డ్ వీక్ మాత్ర‌మే ఆడుతున్న ఈరోజుల్లో స‌ర్కారు వారి పాట 100 రోజులు పూర్తి చేసుకోవ‌డం విశేషం.

మహేష్‌, కీర్తి సురేశ్ జోడీకి .. వాళ్ల లవ్ ట్రాక్ కి మంచి మార్కులు పడ్డాయి. సముద్రఖని విలనిజం హైలైట్ గా నిలిచింది. తమన్ సంగీతం ఈ సినిమాను నిలబెట్టింది. ఆయన పాటల్లో మ మ మహేషా.. మాస్ ఆడియన్స్ లోకి ఒక రేంజ్ లో దూసుకుని వెళ్లింది. మొత్తం మీద ఈ సినిమాతో పరశురామ్ మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. భ‌ర‌త్ అనే నేను, మ‌హ‌ర్షి, స‌రిలేరు నీకెవ్వ‌రు.. ఇలా వ‌రుస‌గా విజ‌యాలు సాధిస్తున్న‌ మ‌హేష్ కి స‌ర్కారు వారి పాట‌ మ‌రో బిగ్ సక్సెస్ అందించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular